సత్తుపల్లి ఏరియా జి.ఎం వెంకటాచారి కి కృతజ్ఞతలు.**ఐఎన్టీయూసీ నేత తీగల క్రాంతి కుమార్*
సూర్య,సత్తుపల్లి,సత్తుపల్లి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో పూర్తిస్థాయిలో అన్ని డిపార్ట్మెంట్ ల ఏర్పాటుకు కృషి చేసిన జనరల్ మేనేజర్ వెంకటాచారి ని మర్యాదపూర్వకంగా కలిసి సత్తుపల్లి ఏరియా ఉద్యోగుల అందరి తరపున కృతజ్ఞతలు తెలిపిన ఐఎన్టీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి తీగల క్రాంతికుమార్.తీగల క్రాంతికుమార్ మాట్లాడుతూ సత్తుపల్లి ఏరియా నుండి సింగరేణి సంస్థ వార్షిక ఉత్పత్తి లక్ష్యంలో అత్యధికంగా బొగ్గు ఉత్పత్తి మరియు రవాణా జరుగుతున్నప్పటికీ ఉద్యోగుల సౌకర్యార్థం సత్తుపల్లి ఏరియా జి.ఎం కార్యాలయంలో పర్సనల్ డిపార్ట్మెంట్ , ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వివిధ డిపార్ట్మెంటు లేకపోవడం వల్ల ఉద్యోగులు ప్రతి చిన్న సమస్యకి కొత్తగూడెం వెళ్లి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో కార్మికుల పక్షాన ఐఎన్టీయూసీ యూనియన్ అభ్యర్థన మేరకు ఏరియా జనరల్ మేనేజర్ వెంకటాచారి చొరవతో సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి మరియు సింగరేణి సంస్థ డైరెక్టర్ లను ఒప్పించి సత్తుపల్లి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో అన్ని డిపార్ట్మెంట్లు ఏర్పాటుకు కృషి చేశారని తెలియజేశారు. అదేవిధంగా నూతనంగా ఏర్పడ్డ సత్తుపల్లి ఏరియాలో ఉద్యోగుల సౌకర్యం డిస్పెన్సరీ ఆధునికరణ , సింగరేణి గ్రౌండ్ , స్విమ్మింగ్ పూల్ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని కోరారు. ఏరియా జనరల్ మేనేజర్ వెంకటాచారి మాట్లాడుతూ ఏరియాలో రక్షణ , నాణ్యతతో కూడిన బొగు ఉత్పత్తి , రవాణా సాధిస్తూ సింగరేణిలో సత్తుపల్లి ఏరియాను అగ్రగామిగా నిలుపుటకు ఉద్యోగులందరూ కృషి చేయాలని తెలియజేస్తూ కార్మికుల సంక్షేమానికి యాజమాన్యం ఎప్పుడూ సహకరిస్తుందని తెలియజేశారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్ పసుపులేటి సత్యనారాయణ