పిన్నంచర్ల గ్రామ అధ్యక్షుడిగా కుమ్మరి తిరుపతన్న
ఆత్మకూరు /మేజర్ న్యూస్: వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం పిన్నించర్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కుమ్మరి తిరుపతన్న ఎన్నికైనట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగేశ్వర్ తెలిపారు. రాష్ట్ర మంత్రి వాకిడి శ్రీహరి సూచన మేరకు డిసిసి అధ్యక్షులు శివసేన రెడ్డి నియామకం చేసినట్లు తెలిపారు. గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన సూచించారు. గ్రామ అధ్యక్షుడిగా ఎంపిక చేయడంపై కుమ్మరి తిరుపతన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.
_రాజారత్నం ,ఆత్మకూరు వనపర్తి జిల్లా.