BREAKING
దీపావళి కానుకగా గ్రామాలకు వెలుగుల జిలుగులు.. శ్రీ వెంకటేశ్వర రెస్టారెంట్ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే రత్నం నేరేడుచర్లలో రోడ్డు ప్రమాదం.. వృద్ధుడు మృతి పల్సర్ బైక్‌ యూటర్న్‌తో ప్రమాదం.. మరొకరికి తీవ్ర గాయాలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ గోపాల్ రెడ్డి గ్రామాల అభివృద్ధికి తెలంగాణ ప్రజా ప్రభుత్వం పెద్దపీట. ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్* చేవెళ్ల పీఎంఆర్ హాస్పిటల్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం! ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు బొంరాస్‌పేట్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. దీపాల వెలుగులతో కళకళలాడిన వ్యాపార సముదాయాలు కొత్త పాండుగౌడ్ కు ఘన నివాళులు* చిన్నారుల చిరునవ్వుల్లో దీపావళి వెలుగులు! బిగ్‌బాస్ హౌస్‌లో వీకెండ్ రగడ: నరేశ్‌కు కన్నీళ్లు తెప్పించిన నాగార్జున వ్యాఖ్యలు ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం.. ఘనంగా గృహప్రవేశం, దీపావళి వేడుకలు : కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పామేనా భీమ్ భారత్ ఘనంగా ‘శివాలయం’ మూవీ టీజర్, పోస్టర్ లాంచ్: భక్తిరసంతో రానున్న ఆధ్యాత్మిక చిత్రం శిశు మంగళ్ అనాథ ఆశ్రమంలో ఘనంగా దీపావళి వేడుకలు: పిల్లలకు కానుకలు అందజేసిన ఎన్టీఆర్ ట్రస్ట్ కోడిపందాల స్థావరంపై బెజ్జూరు పోలీసుల దాడి ఇందిరమ్మ ఇళ్లతో పేదల ఇంట వెలుగులు.. సొంతింటి కల సాకారం : సొసైటీ చైర్మన్ రఘునాథ్ రెడ్డి శ్రీరామ్ చినబాబును సన్మానించిన జబ్బల మీనా : పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్న నేతలు

ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం సొంతింటిలో దీపావళి జరుపుకోవడం ఆనందదాయకం: కలెక్టర్ భవేష్ మిశ్రా

Select Suryaa Now
ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం  సొంతింటిలో దీపావళి జరుపుకోవడం ఆనందదాయకం: కలెక్టర్ భవేష్ మిశ్రా

 

సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి:

ఇల్లు లేని పేదలందరికీ సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. ఆదివారం బాసర మండలం లాబ్ధి గ్రామంలో నిర్వహించిన ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారు అనూష బాయి–నర్సింగ్ కుటుంబంతో కలిసి వారి నూతన గృహంలో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి, పిల్లలకు మిఠాయిలు, టపాసులు, నోటుపుస్తకాలు అందజేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పేద కుటుంబాల్లో సొంతింటి ఆనందం వెల్లివిరుస్తోందని, లాబ్ధి గ్రామం ఇళ్ల నిర్మాణంలో ఆదర్శంగా నిలుస్తోందని ప్రశంసించారు. గ్రామ సమస్యలను అడిగి తెలుసుకుని, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పనులను గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో హౌసింగ్ పీడీ శ్రీనివాస్, ఎంపీవో గంగాసింగ్, సర్పంచ్ శంకర్, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.