BREAKING
ఘనంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు జన్మదిన వేడుక మేము సైతం సోమాజిగూడలో పట్టభద్రుల ఓటరు నమోదు కోసం ఇంటింటి ప్రచారం.... నిస్వార్థ ఉద్యమకారుడిని కోల్పోయాం.. పీటీ స్వామి సేవలు చిరస్మరణీయం! ఏకగ్రీవంగా హైదరాబాద్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ అసోసియేషన్ ఎన్నిక అధ్యక్షుడిగా ఎ. శ్రీనివాస్ , ఉపాధ్యక్షుడు గా ముఖ్తార్ అహ్మద్ సైబర్ నేరాల పట్ల అవగాహన ఉండాలి పూల్స్‌లో అజేయంగా నిలిచిన టైగర్స్ మరియు ఆర్టిస్ట్స్ - హెచ్‌పిఆర్‌సి అరీనా పోలో టోర్నమెంట్ 2026 అమరుల ఆశయ సాధనకు ఐక్య ఉద్యమాలే ఆయుధం! నగర పంచాయతీ ఎన్నిక లు ప్రశాంత్ ఆదర్శ కుటుంబం’ విడుదలతో వెంకీ అభిమానుల సందడి! వెంకటేశ్వర డివిజన్‌లోని సుగ్దేవ్ నగర్ లో ఎం.జి.ఆర్ పర్యటన వేములవాడ భీమేశ్వర స్వామివారి సేవలో ‘కితకితలు’ గీతా సింగ్ గణపతి సచ్చిదానంద స్వామీజీని దర్శించుకున్న రాజ్‌ ఠాకూర్‌ దంపతులు! ఆర్టీసీ బ్రెడ్ విన్నర్ ఉద్యోగులకు రెగ్యులర్‌ కొలువులు అలరించిన జయప్రద రామమూర్తి వేణు గానం

ఇందిరమ్మ ఇళ్లతో నిరుపేదల సొంతింటి కల సాకారం: ఎంసీపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  దోసకాయల వెంకటేష్

Select Suryaa Now
ఇందిరమ్మ ఇళ్లతో నిరుపేదల సొంతింటి కల సాకారం: ఎంసీపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  దోసకాయల వెంకటేష్
శామీర్‌పేట, మేజర్ న్యూస్ :నిరుపేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తోందని మూడుచింతలపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దోసకాయల వెంకటేష్ అన్నారు. మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన వట్టెం ప్రమీల (భర్త నర్సయ్య)కు ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దోసకాయల వెంకటేష్, కౌన్సిలర్లు గోవర్ధన్ రెడ్డి, కటికల శ్రీవాణి వైద్యనాథ్, సరిత శ్రీనివాస్‌లతో కలిసి గృహప్రవేశ వేడుకలో పాల్గొని లబ్ధిదారు కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఇల్లు లేని అర్హులైన నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే సంకల్పంతో ముందుకు సాగుతోందన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలోనూ అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు అందించేందుకు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ సహకారంతో కృషి చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సింగం ఆంజనేయులు, సింగం భాస్కర్ (టెంట్), ఆకుల నాగేష్, కీసర నరసింహులు, తిరిపిగల్ల శ్రీనాథ్, ఆకుల వెంకటేష్, లబ్ధిదారు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.