telangana
హైదరాబాద్‌లో లోటస్ పాండ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత..
హైదరాబాద్: నగరంలోని ఖరీదైన ప్రాంతం లోటస్ పాండ్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వేల కోట్ల రూపాయల విలువైన పార్కు స్థలాన్ని ప్రభుత్వం వేలానికి పెట్టడాన్ని నిరసిస్తూ స్థానిక కాలనీవాసులు ఆందోళనకు దిగారు.
పార్కు స్థలాన్ని విక్రయానికి సిద్ధం చేసే క్రమంలో అధికారులు జేసీబీలతో భూమిని చదును చేసే పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్కులోని విలువైన, దశాబ్దాల నాటి చెట్లను అధికారులు నరికివేస్తుండటంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పచ్చదనాన్ని నాశనం చేస్తూ పార్కు స్థలాన్ని వేలం వేయడం తగదంటూ కాలనీవాసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని జేసీబీలను, చెట్ల నరికివేత పనులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పనులు కొనసాగించేందుకు ప్రయత్నించిన అధికారులకు, అడ్డుకున్న కాలనీవాసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.