BREAKING
చదువుతో పాటు మంచి వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలిః గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రేక్షకుల ప్రేమతో పాటు విమర్శలనూ వినయంగా స్వీకరించాలి.. ఆల్ఫా స్పందనపై నటి శర్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చిత్తూరులో రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు సర్వం సిద్ధం! డిసెంబర్ 12, 13, 14 తేదీల్లో పీవీకేఎన్ కళాశాల మైదానంలో సీనియర్ సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్ పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్.. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి మంది క్రీడాకారుల రాక కట్టుదిట్టమైన భద్రతలోనూ చిన్నారి అభిమానిని ఆప్యాయంగా పలకరించిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్ ప్రత్యేక అవసరాల పిల్లలకు ప్రతిభ వెలికితీతకు క్రీడా పోటీలు దోహదం సర్పంచ్ పూజారీ ఈశ్వరమ్మ బుడ్డయ్య, విద్యార్థుల ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యం ఎంఈఓ బషీర్ అహ్మద్, ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు మండల స్థాయి క్రీడా పోటీలు ఇందిరమ్మ ప్రజా పాలనలో విద్యార్థుల గోడు పట్టదా..? ఎంపీ ఆర్‌.కృష్ణయ్య రూ.1.7 కోట్ల బడ్జెట్‌తో రూ.460 కోట్ల వసూళ్లు.. హనుమాన్ అంశ్ విజయం వెనుక 28 రోజుల ప్రయాణం రామన్నగూడెం తండాలో కేతి బచావో అభియాన్ కార్యక్రమం జ్యోతీరావ్ పూలే కు జర్నలిస్టు నేతల నివాళులు సినీ సంగీతం సమాజానికి అద్దంలాంటిది.. సల్మాన్ ఖాన్ పాట విమర్శలపై జావేద్ అఖ్తర్ కీలక వ్యాఖ్యలు ఘనంగా మహాత్మా జ్యోతిబాపూలే వర్దంతి చిన్నారి పుట్టినరోజు వేడుకలో పర్యావరణ స్ఫూర్తి. పుష్కర్ క్షేత్రంలో శ్రీ బ్రహ్మ దేవుని దర్శించుకున్న అనంతపురం మేయర్ రమేష్ గౌడ్ రామాయణ పార్ట్ 1లో రావణుడిని కీర్తించలేదు.. యశ్ నటన వల్లే ఆదరణ దక్కిందన్న నమిత్ మల్హోత్రా అశోక్ నగర్ సర్పంచ్ కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

ఓటరు కార్డులో మార్పులకు ఒకేసారి దరఖాస్తు చేసుకోవాలి - కలెక్టర్ రాజర్షి షా

Select Suryaa Now
ఓటరు కార్డులో మార్పులకు ఒకేసారి దరఖాస్తు చేసుకోవాలి - కలెక్టర్ రాజర్షి షా
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఓటరు గుర్తింపు కార్డులో మార్పులు చేసుకోవాలనుకునే వారు సంబంధిత నిబంధనల ప్రకారం ఒకేసారి దరఖాస్తు చేసుకోవాలని, ఒకే సవరణ ప్రక్రియలో పదేపదే దరఖాస్తులు సమర్పించరాదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు.కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఓటరు జాబితా సవరణకు సంబంధించిన అప్పీల్‌పై ఆయన విచారణ నిర్వహించారు.మావల మండలం కైలాష్‌నగర్‌కు చెందిన గుండ్లవార్ శేఖర్ తన ఓటరు గుర్తింపు కార్డులో ఇంటిపేరును ‘గుండ్ల’ నుంచి ‘గుండ్లవార్’గా మార్చాలని కోరుతూ 04.07.2026న ఫారం-8 ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగా, ఎన్నికల నమోదు అధికారి 18.09.2026న ఆమోదించారు.అనంతరం తన తండ్రి పేరును ‘గుండ్ల చంద్రకాంత్’ నుంచి ‘గుండ్లవార్ చంద్రకాంత్’గా సవరించాలని కోరుతూ 05.10.2026న మరోసారి ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. అయితే, విచారణ అనంతరం ఈ దరఖాస్తును ERO 26.11.2026న తిరస్కరించారు.దీంతో దరఖాస్తు తిరస్కరణకు గల కారణాలను తెలియజేయాలని కోరుతూ శేఖర్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌కు అప్పీల్ చేసుకున్నారు. దీనిపై విచారణ చేపట్టిన కలెక్టర్ సంబంధిత వివరాలను పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఓటరు జాబితాలో పేరు, ఇంటిపేరు, ఇతర వివరాల్లో మార్పులు అవసరమైనప్పుడు నిబంధనల ప్రకారం సరైన ఆధారాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఒకే సవరణ ప్రక్రియలో పదేపదే దరఖాస్తులు చేయకుండా, నిర్ణీత విధానాన్ని అనుసరించాలని తెలిపారు.డిసెంబర్ 22, 2026న తుది ఓటరు జాబితా ప్రచురించిన అనంతరం సంబంధిత అంశంపై ఎన్నికల నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ ఎన్నికల నమోదు అధికారిని ఆదేశించారు.ఈ విచారణలో ఆర్డీవో జగదీశ్వర్ రావు, మావల తహశీల్దార్ వేణు, ఎన్నికల పర్యవేక్షణ అధికారి నలంద ప్రియ తదితరులు పాల్గొన్నారు.