BREAKING
దిల్‌జిత్ దొసాంజ్ కచేరీలో సన్యా మల్హోత్రా స్టేజ్ డ్యాన్స్.. సందడి చేసిన కరిష్మా కపూర్ చదువుతో పాటు మంచి వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలిః గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రేక్షకుల ప్రేమతో పాటు విమర్శలనూ వినయంగా స్వీకరించాలి.. ఆల్ఫా స్పందనపై నటి శర్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చిత్తూరులో రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు సర్వం సిద్ధం! డిసెంబర్ 12, 13, 14 తేదీల్లో పీవీకేఎన్ కళాశాల మైదానంలో సీనియర్ సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్ పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్.. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి మంది క్రీడాకారుల రాక కట్టుదిట్టమైన భద్రతలోనూ చిన్నారి అభిమానిని ఆప్యాయంగా పలకరించిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్ ప్రత్యేక అవసరాల పిల్లలకు ప్రతిభ వెలికితీతకు క్రీడా పోటీలు దోహదం సర్పంచ్ పూజారీ ఈశ్వరమ్మ బుడ్డయ్య, విద్యార్థుల ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యం ఎంఈఓ బషీర్ అహ్మద్, ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు మండల స్థాయి క్రీడా పోటీలు ఇందిరమ్మ ప్రజా పాలనలో విద్యార్థుల గోడు పట్టదా..? ఎంపీ ఆర్‌.కృష్ణయ్య రూ.1.7 కోట్ల బడ్జెట్‌తో రూ.460 కోట్ల వసూళ్లు.. హనుమాన్ అంశ్ విజయం వెనుక 28 రోజుల ప్రయాణం రామన్నగూడెం తండాలో కేతి బచావో అభియాన్ కార్యక్రమం జ్యోతీరావ్ పూలే కు జర్నలిస్టు నేతల నివాళులు సినీ సంగీతం సమాజానికి అద్దంలాంటిది.. సల్మాన్ ఖాన్ పాట విమర్శలపై జావేద్ అఖ్తర్ కీలక వ్యాఖ్యలు ఘనంగా మహాత్మా జ్యోతిబాపూలే వర్దంతి చిన్నారి పుట్టినరోజు వేడుకలో పర్యావరణ స్ఫూర్తి. పుష్కర్ క్షేత్రంలో శ్రీ బ్రహ్మ దేవుని దర్శించుకున్న అనంతపురం మేయర్ రమేష్ గౌడ్ రామాయణ పార్ట్ 1లో రావణుడిని కీర్తించలేదు.. యశ్ నటన వల్లే ఆదరణ దక్కిందన్న నమిత్ మల్హోత్రా

రబీ సీజన్‌లో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి - జిల్లా వ్యవసాయ అధికారి సుజాత

Select Suryaa Now
రబీ సీజన్‌లో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి - జిల్లా వ్యవసాయ అధికారి సుజాత
సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి : సోన్ మండలం న్యూ వెల్మల్ గ్రామంలోని బయో రీసెర్చ్ సెంటర్‌ను జిల్లా వ్యవసాయ అధికారి సుజాత శుక్రవారం తనిఖీ చేశారు. కేంద్రం నిర్వహణ, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల అమలును పరిశీలించి, రైతులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్‌లో భాగంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను రైతులు అవలంబించాలని సూచించారు. ప్రస్తుత నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని అధిక నీరు అవసరమయ్యే వరి, మొక్కజొన్న పంటలకు బదులుగా తక్కువ నీటితో సాగు చేయగల ఆరుతడి పంటలకు రబీ సీజన్‌లో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నువ్వులు, పొద్దుతిరుగుడు, కుసుమ వంటి నూనెగింజల పంటలతో పాటు శనగ, మినుము, పెసర వంటి పప్పుధాన్యాలు సాగు చేయాలని సూచించారు. జొన్న, సజ్జ, రాగి, కొర్ర వంటి చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలని, కూరగాయల సాగు, పాడి పరిశ్రమపైనా రైతులు దృష్టి సారించాలని తెలిపారు.గత సీజన్‌లో మొక్కజొన్న సాగు చేసిన భూముల్లో పంట మార్పిడిలో భాగంగా ప్రస్తుతం సాగు చేస్తున్న జొన్న పంటను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లాలోని రైతులందరూ రబీ సీజన్‌లో వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించి, ప్రత్యామ్నాయ ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని కోరారు. భూగర్భ జలమట్టాలను పెంచేందుకు ప్రతి రైతు కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా బోరుబావుల సౌకర్యం ఉన్న రైతులు తమ వ్యవసాయ భూముల్లో తప్పనిసరిగా రీచార్జ్ పిట్లు నిర్మించుకోవాలన్నారు. వర్షపు నీటిని భూమిలోకి ఇంకింపజేయడం ద్వారా భూగర్భ జలాలను సంరక్షించుకోవచ్చని వివరించారు.ఈ కార్యక్రమంలో ఏడీఏలు రాజశేఖర్ రెడ్డి, ఆసం రవి, వ్యవసాయ అధికారి వినోద్, ఏఈఓలు, స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు.