BREAKING
పాకిస్థానీ సిరీస్‌పై ఖుష్బూ సుందర్ కీలక వ్యాఖ్యలు.. క్రికెట్ మ్యాచ్‌తో పోలిక ఈశాన్య రాష్ట్రాల్లో క్షయ నిర్మూలన వేగవంతంపై సమీక్ష వెంకటాపూర్‌లో పశువైద్య శిబిరం - 62 పశువులకు వైద్య సేవలు ‘పేపర్ టైగర్’ మూవీ రివ్యూ: అమెరికన్ డ్రీమ్ నేపథ్యంలో జేమ్స్ గ్రే క్రైమ్ డ్రామా ఎలా ఉందంటే? మూలాలు తెలుగు.. పెరిగింది చెన్నైలో.. మనసంతా తమిళమే: ‘డొరోతి’ నటుడు సనంత్ ఆసక్తికర వ్యాఖ్యలు క్వాంటం కంప్యూటింగ్‌తో సరికొత్త ఆవిష్కరణలకు బాటలు. ‘హే కన్నమ్మ’ విడుదల వేళ: దిల్ రాజు ప్రొడక్షన్స్, నిర్మాతలపై హీరో యశ్వంత్ ఆసక్తికర వ్యాఖ్యలు గ్రామపంచాయతీ ఎన్నికల కు పటిష్ట బందోబస్తు *వెలుగుమట్లలో ఇందిరమ్మ ఇండ్లు, మౌళిక సదుపాయాల పనులను పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వర రావు* బాల్యవివాహాలు, డ్రగ్స్‌తో భవిష్యత్తు నాశనం… కమెడియన్ సుధాకర్ నెల రోజులు కోమాలోకి వెళ్లడానికి అసలు కారణం ఇదే: తనయుడు మైఖేల్ బెన్నీ ఆసక్తికర వెల్లడి ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ ‘రాతిరి’: ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న మొదటి ఎపిసోడ్ విశేషాలివే హైదరాబాద్‌లో లోటస్ పాండ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. రిలయన్స్ పరిహారం ఇచ్చేనా..? బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

క్వాంటం కంప్యూటింగ్‌తో సరికొత్త ఆవిష్కరణలకు బాటలు.

Select Suryaa Now
క్వాంటం కంప్యూటింగ్‌తో సరికొత్త ఆవిష్కరణలకు బాటలు.

తిరుపతి రెవెన్యూ మేజర్ న్యూస్ 

క్వాంటం కంప్యూటింగ్‌తో సరికొత్త ఆవిష్కరణలకు బాటలు.

భవిష్యత్తు సాంకేతిక విప్లవంలో క్వాంటం కంప్యూటింగ్ కీలక పాత్ర పోషించనుందని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ సలహాదారు, ఐఐటీ తిరుపతి అడ్జంక్ట్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ వి. వాసుదేవరావు పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న మార్పులు, నూతన ఆవిష్కరణలు ప్రపంచ అభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేస్తున్నాయని వివరించారు.

మోహన్ బాబు యూనివర్సిటీలో శుక్రవారం భౌతికశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో, ఇన్‌స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్ సహకారంతో ఈ సదస్సు నిర్వహించారు. క్వాంటం కంప్యూటింగ్, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, భవిష్యత్తు అనువర్తనాలు అనే అంశంపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. యూనివర్సిటీలోని దాసరి ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ వి. వాసుదేవరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా క్వాంటం కంప్యూటింగ్ సాంకేతికత ప్రాధాన్యత, భవిష్యత్తులో వివిధ రంగాల్లో దాని వినియోగ అవకాశాలు, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంపై విద్యార్థులకు అవగాహన కల్పించే అంశాలు చర్చించారు. సంప్రదాయ కంప్యూటింగ్‌కు భిన్నంగా క్వాంటం కంప్యూటింగ్ అందించగల అవకాశాలు, పరిశోధన రంగంలో దాని ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో డీన్, ఫ్రెష్‌మన్ డాక్టర్ ఎం. బాలాజీ, భౌతికశాస్త్ర విభాగం విభాగాధిపతి డాక్టర్ వై. బి. కిషోర్ కుమార్, ప్రొఫెసర్ పి. విష్ణు ప్రశాంత్, భౌతికశాస్త్ర విభాగం కన్వీనర్ డాక్టర్ ఓబుల రెడ్డి అంకినపల్లి, అధ్యాపకులు పాల్గొన్నారు.

కె రాజేష్ రిపోర్టర్ తిరుపతి 

​