రిలయన్స్ పరిహారం ఇచ్చేనా..?
(తోటపల్లిగూడూరు, మేజర్ న్యూస్)
పవర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం సే కరించిన భూములకు ఇప్పటి వ రకు పరిహారం అందకపోతుండ డంతో ఆ భూములను కోల్పోయి న రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నారు. పరిహారం కోసం రైతులు గత 20 ఏళ్ల నుంచి పడిగాపులు కాస్తున్నారు. అయినప్పటికీ అ టు ప్రభుత్వం నుంచి గానీ, ఇటు రియలన్స్ యాజమాన్యం నుంచి గానీ ఎటువంటి స్పందన కనిపిం చకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. బా ధిత రైతుల ఆవేధన మేరకు వివ రాలిలా వున్నాయి. తోటపల్లిగూ డూరు మండలం మండపం పం చాయతీ పరిధిలో పవర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం 2008లో రైతుల నుంచి 315 ఎకరాల పట్టా భూ ములు, 220 ఎకరాల కామన్ జాయింట్ ఫార్మింగ్ స్కీమ్ (సిజె ఎఫ్ఎస్) వంతున మొత్తం 535 ఎకరాలను రిలయన్స్ సేకరించిం ది. ఈ మేరకు ఎకరా పట్టా భూ మికి సంబంధించి రూ. 8 లక్షలు, అలాగే ఎకరా సిజెఎఫ్ఎస్ భూ ములకు సంబంధించి రూ. 6,16, 400 వంతున పరిహారం అందిం చేలా నిర్ణయం జరిగింది. ఈ నిర్ణ యం ప్రకారం 2009, 2010, 20 11, 2012లలో 315 ఎకరాల ప ట్టా భూములకు, అలాగే 160-1 70 ఎకరాల సిజెఎఫ్ఎస్ భూము లకు రిలయన్స్ పరిహారం అంద జేయడం జరిగింది. వాటిని మిన హాయిస్తే ఇంకా 50 ఎకరాల వర కు సిజెఎఫ్ఎస్ భూములకు సం బంధించి రైతులకు ఇప్పటి వర కు రియలన్స్ యాజమాన్యం నుంచి రైతులకు ఒక్కరూ పాయి పరిహారం అందక పోవడం గమ నార్హం. ఈ 50 ఎకరాలు నిరుపేద గిరిజనులకు సంబంధించినవి. గ త 20 ఏళ్ల నుంచి పరిహారం కో సం ఈ గిరిజన రైతులు పడిగా పులు కాస్తున్నారు. చట్టం ప్రకా రం 12 ఏళ్ల పాటు సిజెఎఫ్ఎస్ భూములలో సాగు చేపట్టకపోతే తిరిగి సదరు భూములు సంబం ధిత రైతులకే చెందాలి. అయితే ఏకంగా 20 ఏళ్ల పరిహారం ఇవ్వ కుండా, ఎటువంటి సాగు చేపట్ట కుండా వున్న సదరు భూముల ను రిలయన్స్ యాజమాన్యం రై తులకు తిరిగి అప్పగించకపోవ డం ఒక విశేషం అయితే, పరిహా రం పంపిణీ చేయకనే తాజాగా పనులు ప్రారం భించడం మరో వి శేషం. ఏదేమైనా ప్రభుత్వం తమ కు ఇచ్చిన సిజెఎఫ్ఎస్ భూము ల్లో అటు సాగు చేసుకోలేక, ఇటు రిలయన్స్ సంస్థ నుంచి పరిహా రం అందక 50 పేద గిరిజన కు టుంబాలు పడుతున్న అవస్థలు వర్ణణాతీతంగా మారాయి. ఈ నే పథ్యంలో జిల్లా కలెక్టర్ జోక్యం చే సుకొని తమకు న్యాయం చేయా లని రిలయన్స్ సంస్థ బాధిత గిరి జనులు విజ్ఞప్తి చేస్తున్నారు.