BREAKING
వెంకటాపూర్‌లో పశువైద్య శిబిరం - 62 పశువులకు వైద్య సేవలు ‘పేపర్ టైగర్’ మూవీ రివ్యూ: అమెరికన్ డ్రీమ్ నేపథ్యంలో జేమ్స్ గ్రే క్రైమ్ డ్రామా ఎలా ఉందంటే? మూలాలు తెలుగు.. పెరిగింది చెన్నైలో.. మనసంతా తమిళమే: ‘డొరోతి’ నటుడు సనంత్ ఆసక్తికర వ్యాఖ్యలు క్వాంటం కంప్యూటింగ్‌తో సరికొత్త ఆవిష్కరణలకు బాటలు. ‘హే కన్నమ్మ’ విడుదల వేళ: దిల్ రాజు ప్రొడక్షన్స్, నిర్మాతలపై హీరో యశ్వంత్ ఆసక్తికర వ్యాఖ్యలు గ్రామపంచాయతీ ఎన్నికల కు పటిష్ట బందోబస్తు *వెలుగుమట్లలో ఇందిరమ్మ ఇండ్లు, మౌళిక సదుపాయాల పనులను పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వర రావు* బాల్యవివాహాలు, డ్రగ్స్‌తో భవిష్యత్తు నాశనం… కమెడియన్ సుధాకర్ నెల రోజులు కోమాలోకి వెళ్లడానికి అసలు కారణం ఇదే: తనయుడు మైఖేల్ బెన్నీ ఆసక్తికర వెల్లడి ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ ‘రాతిరి’: ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న మొదటి ఎపిసోడ్ విశేషాలివే హైదరాబాద్‌లో లోటస్ పాండ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. రిలయన్స్ పరిహారం ఇచ్చేనా..? బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ‘మొహబ్బత్’ నుంచి యూత్‌ఫుల్ లవ్ సాంగ్.. ‘వరమే’ పాట విడుదల ఆరు నెలలుగా జీతాలు లేవు ఔట్సోర్సింగ్ సిబ్బంది ఆవేదన.... పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి నిరసన వ్యక్తం చేసిన ఉద్యోగులు

బాల్యవివాహాలు, డ్రగ్స్‌తో భవిష్యత్తు నాశనం…

Select Suryaa Now
బాల్యవివాహాలు, డ్రగ్స్‌తో భవిష్యత్తు నాశనం…

సూర్య,కూసుమంచి బాల్యాన్ని కాపాడి బాలల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని, యువత జీవితాలను నాశనం చేసే మాదకద్రవ్యాలకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి దేవి మానస సూచించారు. బాల్యవివాహాల నిర్మూలన, డ్రగ్స్ నివారణపై విద్యార్థి దశ నుంచే అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు. నవంబర్ 27 అంతర్జాతీయ బాల్య, ముందస్తు, బలవంతపు వివాహాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని AID NGO, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఖమ్మం ఆధ్వర్యంలో గురువారం కూసుమంచి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న దేవి మానస బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాలు, వాటిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. చిన్న వయస్సులో వివాహాలు చేయడం వల్ల బాలికల విద్యాభ్యాసం మధ్యలోనే నిలిచిపోవడంతో పాటు వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపారు. బాల్యవివాహాల నిషేధ చట్టం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, ఇలాంటి ఘటనలు ఎక్కడైనా చోటుచేసుకుంటే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. పిల్లలపై వివాహాల ఒత్తిడి తీసుకురాకుండా తల్లిదండ్రులు వారి అభిరుచులు, చదువు, భవిష్యత్తుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. మాదకద్రవ్యాల అంశంపై మాట్లాడుతూ డ్రగ్స్‌కు అలవాటు పడటం వల్ల వ్యక్తిగత జీవితం, ఆరోగ్యం, కుటుంబ సంబంధాలు దెబ్బతింటాయని హెచ్చరించారు. ముఖ్యంగా విద్యార్థులు చెడు వ్యసనాలకు ఆకర్షితులు కాకుండా అప్రమత్తంగా ఉండాలని, స్నేహితుల ఒత్తిడికి లోనై మత్తు పదార్థాల జోలికి వెళ్లకూడదని సూచించారు. ఆరోగ్యకరమైన అలవాట్లతో క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతూ సమాజానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా బాలల సంక్షేమ కమిటీ సభ్యులు లక్ష్మయ్య, సీడీపీఓ కవిత, తహసీల్దార్ సైదులు, పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ సాయి కుమార్, మండల విద్యాశాఖ అధికారి రాయల వీరస్వామి, ఉమెన్ హబ్ జిల్లా కోఆర్డినేటర్ సమ్రీన్, కే. సతీష్, AID NGO కోఆర్డినేటర్ కే. శ్రీనివాస్, బృంద సభ్యులు రాందాస్, రవీంద్రబాబు, భాస్కర్, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సూర్య ఆర్ సి రిపోర్టర్ ఇరుగు శ్రీను పాలేరు