BREAKING
ప్రేక్షకుల ప్రేమతో పాటు విమర్శలనూ వినయంగా స్వీకరించాలి.. ఆల్ఫా స్పందనపై నటి శర్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చిత్తూరులో రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు సర్వం సిద్ధం! డిసెంబర్ 12, 13, 14 తేదీల్లో పీవీకేఎన్ కళాశాల మైదానంలో సీనియర్ సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్ పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్.. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి మంది క్రీడాకారుల రాక కట్టుదిట్టమైన భద్రతలోనూ చిన్నారి అభిమానిని ఆప్యాయంగా పలకరించిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్ ప్రత్యేక అవసరాల పిల్లలకు ప్రతిభ వెలికితీతకు క్రీడా పోటీలు దోహదం సర్పంచ్ పూజారీ ఈశ్వరమ్మ బుడ్డయ్య, విద్యార్థుల ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యం ఎంఈఓ బషీర్ అహ్మద్, ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు మండల స్థాయి క్రీడా పోటీలు ఇందిరమ్మ ప్రజా పాలనలో విద్యార్థుల గోడు పట్టదా..? ఎంపీ ఆర్‌.కృష్ణయ్య రూ.1.7 కోట్ల బడ్జెట్‌తో రూ.460 కోట్ల వసూళ్లు.. హనుమాన్ అంశ్ విజయం వెనుక 28 రోజుల ప్రయాణం రామన్నగూడెం తండాలో కేతి బచావో అభియాన్ కార్యక్రమం జ్యోతీరావ్ పూలే కు జర్నలిస్టు నేతల నివాళులు సినీ సంగీతం సమాజానికి అద్దంలాంటిది.. సల్మాన్ ఖాన్ పాట విమర్శలపై జావేద్ అఖ్తర్ కీలక వ్యాఖ్యలు ఘనంగా మహాత్మా జ్యోతిబాపూలే వర్దంతి చిన్నారి పుట్టినరోజు వేడుకలో పర్యావరణ స్ఫూర్తి. పుష్కర్ క్షేత్రంలో శ్రీ బ్రహ్మ దేవుని దర్శించుకున్న అనంతపురం మేయర్ రమేష్ గౌడ్ రామాయణ పార్ట్ 1లో రావణుడిని కీర్తించలేదు.. యశ్ నటన వల్లే ఆదరణ దక్కిందన్న నమిత్ మల్హోత్రా అశోక్ నగర్ సర్పంచ్ కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు యామీ గౌతమ్ పుట్టినరోజు వేళ ఆదిత్య ధర్ భావోద్వేగ పోస్ట్.. వెకేషన్ ఫొటోలు వైరల్

హన్మకొండలో 14 ఏళ్ల వెట్టిచాకిరి గుట్టురట్టు.. 25 మందికి విముక్తి..

Select Suryaa Now
హన్మకొండలో 14 ఏళ్ల వెట్టిచాకిరి గుట్టురట్టు.. 25 మందికి విముక్తి..
హన్మకొండ (మేజర్ న్యూస్): హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో 14 ఏళ్లుగా సాగుతున్న దారుణ వెట్టిచాకిరి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇటుక బట్టీలో నిర్బంధించి వెట్టిచాకిరి చేయించుకుంటున్న 8 దళిత కుటుంబాలకు చెందిన 25 మందికి అధికారులు విముక్తి కల్పించారు. వీరిలో ఇద్దరు బాలకార్మికులు కూడా ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కావలి ప్రాంతానికి చెందిన ఆర్మూర్ శివ 14 ఏళ్ల క్రితం కమలాపూర్‌కు వచ్చాడు. ఇక్కడ రెండు చోట్ల భూమిని లీజుకు తీసుకుని 'శివ బ్రిక్స్ ఇండస్ట్రీ' పేరుతో ఇటుక బట్టీని ఏర్పాటు చేశాడు. పనుల కోసం కావలి నుంచే 8 దళిత కుటుంబాలను తీసుకొచ్చి, వారిని బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా నిర్బంధించి దశాబ్ద కాలం పైగా వెట్టిచాకిరి చేయించుకుంటున్నాడు.

ఈ దారుణంపై స్వచ్ఛంద సంస్థ 'ఎఫ్‌ఎంఎంఎస్' (FMMS) ఇచ్చిన ఫిర్యాదుతో యంత్రాంగం అప్రమత్తమైంది. హన్మకొండ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీస్ మరియు శిశు సంక్షేమ శాఖ అధికారులు సంయుక్తంగా శివ బ్రిక్స్ ఇండస్ట్రీపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. తనిఖీల్లో వెట్టిచాకిరి వాస్తవమని తేలడంతో బాధితులందరినీ సురక్షితంగా రక్షించి విముక్తి కల్పించారు. బాధ్యుడైన ఆర్మూర్ శివపై అధికారులు చట్టపరమైన చర్యలు చేపట్టారు.