BREAKING
చదువుతో పాటు మంచి వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలిః గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రేక్షకుల ప్రేమతో పాటు విమర్శలనూ వినయంగా స్వీకరించాలి.. ఆల్ఫా స్పందనపై నటి శర్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చిత్తూరులో రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు సర్వం సిద్ధం! డిసెంబర్ 12, 13, 14 తేదీల్లో పీవీకేఎన్ కళాశాల మైదానంలో సీనియర్ సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్ పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్.. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి మంది క్రీడాకారుల రాక కట్టుదిట్టమైన భద్రతలోనూ చిన్నారి అభిమానిని ఆప్యాయంగా పలకరించిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్ ప్రత్యేక అవసరాల పిల్లలకు ప్రతిభ వెలికితీతకు క్రీడా పోటీలు దోహదం సర్పంచ్ పూజారీ ఈశ్వరమ్మ బుడ్డయ్య, విద్యార్థుల ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యం ఎంఈఓ బషీర్ అహ్మద్, ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు మండల స్థాయి క్రీడా పోటీలు ఇందిరమ్మ ప్రజా పాలనలో విద్యార్థుల గోడు పట్టదా..? ఎంపీ ఆర్‌.కృష్ణయ్య రూ.1.7 కోట్ల బడ్జెట్‌తో రూ.460 కోట్ల వసూళ్లు.. హనుమాన్ అంశ్ విజయం వెనుక 28 రోజుల ప్రయాణం రామన్నగూడెం తండాలో కేతి బచావో అభియాన్ కార్యక్రమం జ్యోతీరావ్ పూలే కు జర్నలిస్టు నేతల నివాళులు సినీ సంగీతం సమాజానికి అద్దంలాంటిది.. సల్మాన్ ఖాన్ పాట విమర్శలపై జావేద్ అఖ్తర్ కీలక వ్యాఖ్యలు ఘనంగా మహాత్మా జ్యోతిబాపూలే వర్దంతి చిన్నారి పుట్టినరోజు వేడుకలో పర్యావరణ స్ఫూర్తి. పుష్కర్ క్షేత్రంలో శ్రీ బ్రహ్మ దేవుని దర్శించుకున్న అనంతపురం మేయర్ రమేష్ గౌడ్ రామాయణ పార్ట్ 1లో రావణుడిని కీర్తించలేదు.. యశ్ నటన వల్లే ఆదరణ దక్కిందన్న నమిత్ మల్హోత్రా అశోక్ నగర్ సర్పంచ్ కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

నూతన మీ-సేవ కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్‌ రాజర్షి షా

Select Suryaa Now
నూతన మీ-సేవ కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్‌ రాజర్షి షా
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : జిల్లాలో ప్రజలకు పారదర్శకంగా, నాణ్యమైన పౌర సేవలను అందించడమే లక్ష్యంగా గ్రామాలు, మండలాల స్థాయిలో కొత్త మీ-సేవ కేంద్రాల కేటాయింపు ప్రక్రియను చేపట్టినట్లు జిల్లా కలెక్టర్‌ రాజర్షిషా తెలిపారు. శుక్రవారం పట్టణంలోని మసూద్‌ చౌక్‌లో సైఫ్‌ అహ్మద్‌ మసూద్‌కు మంజూరైన నూతన మీ-సేవ కేంద్రాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, గత కొద్ది నెలలుగా జిల్లాలో అవసరమైన ప్రాంతాలను గుర్తించి కొత్త మీ-సేవ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సైఫ్‌ అహ్మద్‌ దివ్యాంగుడు కావడంతో పాటు గతంలో మీ-సేవ కేంద్రంలో పనిచేసిన అనుభవం, జెరాక్స్‌ దుకాణం నిర్వహిస్తున్న నేపథ్యం ఉండటంతో ఈ కేంద్రానికి పూర్తి అర్హత కలిగి ఉన్నారని పేర్కొన్నారు. ఆయనకు కేంద్రం కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా, తక్షణమే ఆమోదం లభించిందని, నవంబరు 9న మీ-సేవ ఐడీ సైతం మంజూరైందని వివరించారు. మసూద్‌ చౌక్‌లో మీ-సేవ కేంద్రం అందుబాటులోకి రావడం సంతోషకరమని అన్నారు. మీ-సేవ కేంద్రాల ద్వారా ప్రజలకు ఎన్నో కీలక సేవలు అందుతున్నాయని, వివిధ ధ్రువపత్రాల జారీ, భూభారతి సంబంధిత అంశాలు, ఆలస్యంగా నమోదయ్యే జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, పట్టణ ప్రణాళిక వంటి అనేక సేవలను ప్రజలకు సకాలంలో అందించాలని సూచించారు. ఈ కేంద్రం ద్వారా స్థానికులకు మెరుగైన సేవలు అందిస్తూ, మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. జిల్లాలోని మీ-సేవ కేంద్రాల పనితీరుపై ఈడీఎం ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారని, ఎక్కడైనా లోపాలు లేదా అవకతవకలు గుర్తిస్తే వెంటనే చర్యలు తీసుకుంటున్నారని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మీసేవ నిర్వాహకులు సైఫ్ అహ్మద్ మసూద్, కుటుంబ సభ్యులు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.