BREAKING
కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమానికి ప్రజల మద్దతు: వై.వి.బి. రాజేంద్రప్రసాద్ కాంగ్రెస్‌లో ముదురుతున్న విభేదాలు: రాహుల్ గాంధీ కార్యక్రమానికి సీఎం సిద్ధరామయ్య దూరం! ఇందిరమ్మ ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి దీపావళి సంబరాలు ఏపీ MPTC ఫలితాలు: కూటమి హవా.. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం శ్రీ లక్ష్మీ అమ్మవారు హిమాచల్‌ప్రదేశ్‌లో భూకంపం: చంబా ప్రాంతంలో ప్రకంపనలు ప్రతి ఇంటా ఆనందాల వెలుగులు నిండాలి: విక్కుర్తి శ్రీనివాసరావు దేశవ్యాప్తంగా మిన్నంటిన దీపావళి సంబరాలు: వెలుగుల కాంతులతో మెరిసిపోతున్న నగరాలు, పల్లెలు ఉచిత బస్సు పథకం రద్దు చేసే ప్రసక్తే లేదు'.. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: డీసీఎం ఢీకొని ఇద్దరు యువకులు మృతి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా దీపావళి వేడుకలు బీటెక్ విద్యార్థి అనుమానాస్పద మృతి.. కాలేజీ యాజమాన్యం తీరుపై బంధువుల ఆగ్రహం! రామాయణ పైరసీకి బాంబే హైకోర్టు చెక్: ఆన్‌లైన్ ప్రింట్లు వెంటనే తొలగించాలని నిర్మాతల హెచ్చరిక ఫుడ్ పాయిజన్ ఘటనపై... DMHO ఆకస్మిక తనిఖీలు కార్తీక మాసం ఏర్పాట్లను పరిశీలించిన ఈవో శీనా నాయక్

హబీబ్‌నగర్‌లో అక్రమ నిర్మాణం ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలి: పారదర్శక విచారణకు డిమాండ్

Select Suryaa Now
హబీబ్‌నగర్‌లో అక్రమ నిర్మాణం  ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలి: పారదర్శక విచారణకు డిమాండ్

కూకట్ పల్లి, మేజర్ న్యూస్:కూకట్‌పల్లి పరిధిలో అక్రమ నిర్మాణాల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారుతోంది. పట్టణ ప్రణాళిక నిబంధనలు, భవన నిర్మాణ అనుమతులు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూసాపేట హబీబ్‌నగర్‌లోని ఇంటి నంబర్ 7-133/104/1, సర్కిల్-53, వార్డు-257 పరిధిలో జరుగుతున్న భవన నిర్మాణంపై పలు అభ్యంతరాలు వెలువడుతున్నాయి.
సంబంధిత భవన నిర్మాణం అనుమతులకు మించి అదనపు అంతస్తులు నిర్మిస్తున్నారా? భవనానికి ఆనుకుని ఉన్న రహదారి వెడల్పుకు అనుగుణంగానే అనుమతులు జారీ అయ్యాయా? నిబంధనల ప్రకారం వదలాల్సిన ముందు, వెనుక, పక్క సెట్‌బ్యాక్‌లను పాటిస్తున్నారా? భవన నివాసితులు, సందర్శకుల కోసం తప్పనిసరిగా కల్పించాల్సిన పార్కింగ్ స్థలాన్ని వాస్తవంగా ఏర్పాటు చేస్తున్నారా? అన్న అంశాలపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది. భవన నిర్మాణ నిబంధనల్లో రహదారి వెడల్పు, భవనం ఎత్తు, అంతస్తుల సంఖ్య, స్థల విస్తీర్ణం, సెట్‌బ్యాక్‌లు, పార్కింగ్ వంటి అంశాలు అత్యంత కీలకం. వీటిలో ఏ ఒక్క నిబంధనను ఉల్లంఘించినా భవిష్యత్తులో స్థానిక ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు, అత్యవసర సమయాల్లో అగ్నిమాపక వాహనాల రాకపోకలకు ఆటంకాలు, పారిశుద్ధ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది.
ఇక అక్రమ నిర్మాణాల వెనుక కొందరు అధికారులు పరోక్షంగా సహకరిస్తున్నారనే ఆరోపణలు కూడా స్థానికంగా వినిపిస్తున్నాయి. డబ్బులకు ప్రాధాన్యతనిస్తూ నిబంధనల ఉల్లంఘనలను చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారా? అనే సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు పారదర్శకంగా విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాల్సిన బాధ్యత ఉంది. అధికారుల మౌనం.. నిర్మాణదారులకు వరమా? అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు వచ్చినప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, మంజూరైన భవన ప్రణాళికతో వాస్తవ నిర్మాణాన్ని పోల్చి చూడాల్సిన బాధ్యత టౌన్‌ప్లానింగ్ అధికారులపై ఉంది. ఉల్లంఘనలు నిర్ధారణ అయితే చట్టప్రకారం నోటీసులు జారీ చేసి తదుపరి చర్యలు తీసుకోవాలి. కానీ నిర్మాణం పూర్తయ్యే వరకు అధికారులు స్పందించకపోతే, నిబంధనలు పాటించే సామాన్య ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలి. సంబంధిత భవనానికి మంజూరైన బిల్డింగ్ పర్మిషన్, శాంక్షన్ ప్లాన్, అనుమతించిన అంతస్తులు, వాస్తవ నిర్మాణం, రహదారి వెడల్పు, తప్పనిసరి సెట్‌బ్యాక్‌లు, పార్కింగ్ ఏర్పాట్లపై సమగ్ర స్థల పరిశీలన నిర్వహించాలి. నిర్మాణ అనుమతుల జారీ నుంచి క్షేత్రస్థాయి పర్యవేక్షణ వరకు జరిగిన ప్రక్రియను పరిశీలించి, అక్రమాలు నిర్ధారణ అయితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ప్రజల భద్రత, పట్టణ ప్రణాళిక, భవిష్యత్తు మౌలిక సదుపాయాల పరిరక్షణ ప్రభుత్వ యంత్రాంగం ప్రథమ బాధ్యత. భవన నిర్మాణదారుల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తారా? లేక చట్టబద్ధంగా నివసించే ప్రజల హక్కులను కాపాడతారా? అన్నది సంబంధిత మున్సిపల్ అధికారుల చర్యలే తేల్చాలి.