BREAKING
భారత్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన ఆస్ట్రేలియా.. కరారా ఓవల్‌లో అత్యధిక టీ20 స్కోరు! రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ఎస్‌ఐఆర్‌ పేరుతో కాలరాస్తారా? మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మా వైపు నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదు.. పూర్తి సహకారం అందిస్తాం. మున్సిపల్ చైర్మన్. ఐపీఎల్ 2027కు న్యూజిలాండ్ స్టార్ పేసర్ గుడ్‌బై.. సీఎస్కే రిలీజ్ చేయగానే పీఎస్ఎల్‌తో భారీ డీల్! ఎన్డీయే కూటమి ఐక్యతతోనే గ్రామాల అభివృద్ధి శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయంలో భక్తిశ్రద్ధలతో కార్తీక పౌర్ణమి వేడుకలు భార్యపై అనుమానం... ఆస్తి కోసం అత్తపై కత్తితో దాడి-అల్లుడు రాజేష్ అరెస్ట్ రిమాండ్ కు తరలింపు హర్షిత్ రాణా సహా ఇండియా ఏ ఆటగాళ్లపై పాకిస్థాన్ ఫిర్యాదు.. రైజింగ్ స్టార్స్ మ్యాచ్ వివాదం! నూతన వధూవరులను ఆశీర్వదించిన మడకశిర ఎమ్మెల్యే. స్వేచ్ఛాయుత వాతావరణంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం! ఎరువుల దుకాణాలపై వ్యవసాయ అధికారుల ఆకస్మిక తనిఖీలు విరాట్ కోహ్లి భారీ రికార్డు బద్దలు కొట్టిన బాబర్ ఆజం.. ఐఎల్‌టీ20 అరంగేట్రంలోనే అదుర్స్! సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ప్రియాంష్ ఆర్య విధ్వంసం.. టీ20లో అత్యధిక వ్యక్తిగత స్కోరుతో భారత రికార్డు! అగ్రిగోల్డ్ బాధితుల నిరీక్షణకు తెర-ఈనెల 25 నుంచి బాండ్ల పరిశీలన-వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్ .శ్వేత అండాల అక్రమ సేకరణ కేసులో డాక్టర్ పద్మజకు షాక్‌

గుర్రంపోడ్ లో 21వ రోజుకు చేరిన VOAల సమ్మె: 15 మండలాల మద్దతుతో భారీ ర్యాలీ

Select Suryaa Now
గుర్రంపోడ్ లో 21వ రోజుకు చేరిన VOAల సమ్మె: 15 మండలాల మద్దతుతో భారీ ర్యాలీ

 

గుర్రంపోడ్ మేజర్ న్యూస్ :

తమ బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ గుర్రంపోడ్ మండలంలో VOAలు (విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు) చేపట్టిన నిరసన సమ్మె బుధవారానికి 21వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా మండల కేంద్రంలో వివోఏలు భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. గుర్రంపోడ్ వివోఏల పోరాటానికి మద్దతుగా నల్లగొండ జిల్లాలోని 15 మండలాలకు చెందిన వివోఏలు తరలివచ్చి ర్యాలీలో పాల్గొని తమ సంఘీభావం ప్రకటించారు.
​పిడి గారు తక్షణమే జోక్యం చేసుకోవాలి: జిల్లా అధ్యక్షుడు దుర్గయ్య
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు దుర్గయ్య మాట్లాడుతూ... డిఆర్డిఏ పీడీ (PD) గారు తక్షణమే స్పందించి వివోఏల సమస్యలపై దృష్టి సారించాలని కోరారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఏపీఎం (APM), సీసీల (CC) తీరును మందలించి, వివోఏలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకపోతే రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు జిల్లాలోని వివోఏలందరితో కలెక్టరేట్ ముట్టడి, ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
​సీసీల గ్రేడింగ్ లోపంతోనే వేతనాలు నిలిచిపోయాయి: వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకన్న యాదవ్
జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకన్న యాదవ్ మాట్లాడుతూ... వివోఏలకు రావలసిన రూ.5,000 నెలసరి వేతనం సీసీల గ్రేడింగ్ సక్రమంగా చేయకపోవడం వల్లే ఆగిపోయిందని, దీనికి కారణమైన వారిపై పీడీ గారు కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సెర్ప్ (SERP) అనేది ఒక కుటుంబమని, దానికి తండ్రి లాంటి పీడీ గారు పెద్దమనస్సుతో తమ బాధలను అర్థం చేసుకుని బకాయి వేతనాలు చెల్లించేలా చూడాలన్నారు.
​సమస్యలు పరిష్కారం కాకపోతే రాస్తారోకో, వంటా-వార్పు, కలెక్టరేట్ ముట్టడి చేపడతామని స్పష్టం చేశారు. గ్రేడింగ్ విధానంలో సీసీలదే తప్పని ఇచ్చిన లేఖ ఆధారంగా సెర్ప్ సీఈఓ (CEO) గారిని కలసి తమ సమస్యలను విన్నవిస్తామని తెలిపారు.
​పాల్గొన్న VOA నాయకులు:
ఈ కార్యక్రమంలో గుర్రంపోడు మండల అధ్యక్షురాలు ఎస్. సైదమ్మ, నాయకులు ఎ. లక్ష్మి, బి. రుద్రమ్మ, యాదయ్య, ధనమ్మ, పుష్ప, రజిత, నాగమణితో పాటు 15 మండలాల VOA ప్రతినిధులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.