BREAKING
పులిరామన్నగూడెం ఎంపీటీసీ అభ్యర్థిగా బన్నే పూర్ణ కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలి భీమవరం జెడ్పీటీసీగా కత్తుల సిరి మహాలక్ష్మి, వీరవాసరం ఎంపీపీగా భోగిరెడ్డి శ్రీనివాసరావు విజయాలను తెచ్చే కనకదుర్గమ్మ ఆశీషులు ప్రజలందరిపై ఉండాలి 'చెప్పాం – చేస్తున్నాం' బ్రోచర్ ఆవిష్కరణ: కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం – టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ళ నాగేశ్వర రావు విజయదశమి సందర్భంగా ఘనంగా ఆయుధ, వాహన పూజలు పోలీసు శాఖ ప్రజలకు మెరుగైన సేవలందించాలి: ఎస్పీ అద్నాన్ నయీం అస్మి జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఎన్నికల నిర్వహణలో నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వ్యవహరించాలి: కలెక్టర్ నాగరాణి కూటమి చైర్మన్ అభ్యర్థిగా శ్రీరామ్ చినబాబుకి బి-ఫారం : అందజేసిన ఎమ్మెల్యే జహా,టీడీపీ జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు మెట్లకుంటలో దుర్గామాత చీర రూ.30 వేలకు వేలం.. దక్కించుకున్న చౌదర్పల్లి గోపాల్–అనిత దంపతులు ఇల్లెందు లోరాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన- పలు అభివృద్ధి పనులకు శ్రీకారం పేకాట స్థావరం పై పోలీసుల మెరుపు దాడి చేసిన పొన్నూరు అర్బన్ పోలీసులు -అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు...... అర్బన్ సీఐ ఆర్ఎస్ కిషోర్ కుమార్ చెరుకులపాడులో వైఎస్ఆర్సీపీ ఐడీ కార్డుల పంపిణీ దసరా పర్వదినోత్సవాన.. జమలాపురం వేంకటేశ్వరస్వామి, తక్కెళ్లపాడు లలితా రాజరాజేశ్వరి అమ్మవారికి మంత్రి పొంగులేటి కుటుంబం ప్రత్యేక పూజలు దసరా వేళ స్వగ్రామానికి పొంగులేటి.. నారాయణపురంలో పండుగ సందడి భక్తిశ్రద్ధలతో..రేజర్లలో శివాద్రి గిరి ప్రదక్షిణ ప్రారంభం దుర్గా నాగమల్లేశ్వర స్వామికి మంత్రి పొంగులేటి ప్రత్యేక పూజలు విజయదశమి సందర్భంగా అఖండ అన్న సమారాధన ప్రారంభం కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ సతీమణి వెంకట శ్రీదేవి చేతుల మీదుగా ప్రారంభం

గ్రామపంచాయతీ సిబ్బందికి దుస్తుల పంపిణీ

Select Suryaa Now
గ్రామపంచాయతీ సిబ్బందికి దుస్తుల పంపిణీ

గీసుగొండ , మేజర్ న్యూస్, గ్రామాల పరిశుభ్రత, పురోగతిలో గ్రామ పంచాయతీ సిబ్బంది అందిస్తున్న సేవలు అపారమని, వారి కష్టాన్ని గుర్తించి ఆదుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని నిమ్స్ ఆసుపత్రి లైజనింగ్ ఆఫీసర్,  డాక్టర్ మార్త రమేష్ అన్నారు. విజయదశమి పండుగను పురస్కరించుకుని గీసుకొండ మండలం ఎలుకుర్తి హవేలీ గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఆయన దసరా కానుకగా నూతన వస్త్రాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ మార్త రమేష్ మాట్లాడుతూ  రాత్రింబవళ్లు తేడా లేకుండా గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన సేవలందిస్తూ, ఊరి పరిశుభ్రతకు శ్రమిస్తున్న పంచాయతీ సిబ్బంది సేవలు మరువలేనివని కొనియాడారు. పండుగ పూట వారి ముఖాల్లో ఆనందం చూడాలనే ఉద్దేశంతోనే ప్రతి ఏటా ఈ రకమైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులోనూ గ్రామానికి, గ్రామీణ పేదలకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన హామీ ఇచ్చారు.
పంచాయతీ సిబ్బందికి పండుగ కానుకగా దుస్తులు అందజేసి, వారిలో పండుగ ఉత్సాహాన్ని నింపిన దాత డాక్టర్ మార్త రమేష్‌కు స్థానిక నాయకులు, పంచాయతీ పాలకవర్గం,సిబ్బంది ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ నల్ల సురేష్ బాబు,నాయకులు దుకిరే రమేష్, కారోబార్ శంకర్,గ్రామ పంచాయతీ సిబ్బంది, స్థానిక  వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్: చందర్, వరంగల్ జిల్లా