BREAKING
దీపావళి కానుకగా గ్రామాలకు వెలుగుల జిలుగులు.. శ్రీ వెంకటేశ్వర రెస్టారెంట్ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే రత్నం నేరేడుచర్లలో రోడ్డు ప్రమాదం.. వృద్ధుడు మృతి పల్సర్ బైక్‌ యూటర్న్‌తో ప్రమాదం.. మరొకరికి తీవ్ర గాయాలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ గోపాల్ రెడ్డి గ్రామాల అభివృద్ధికి తెలంగాణ ప్రజా ప్రభుత్వం పెద్దపీట. ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్* చేవెళ్ల పీఎంఆర్ హాస్పిటల్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం! ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు బొంరాస్‌పేట్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. దీపాల వెలుగులతో కళకళలాడిన వ్యాపార సముదాయాలు కొత్త పాండుగౌడ్ కు ఘన నివాళులు* చిన్నారుల చిరునవ్వుల్లో దీపావళి వెలుగులు! బిగ్‌బాస్ హౌస్‌లో వీకెండ్ రగడ: నరేశ్‌కు కన్నీళ్లు తెప్పించిన నాగార్జున వ్యాఖ్యలు ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం.. ఘనంగా గృహప్రవేశం, దీపావళి వేడుకలు : కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పామేనా భీమ్ భారత్ ఘనంగా ‘శివాలయం’ మూవీ టీజర్, పోస్టర్ లాంచ్: భక్తిరసంతో రానున్న ఆధ్యాత్మిక చిత్రం శిశు మంగళ్ అనాథ ఆశ్రమంలో ఘనంగా దీపావళి వేడుకలు: పిల్లలకు కానుకలు అందజేసిన ఎన్టీఆర్ ట్రస్ట్ కోడిపందాల స్థావరంపై బెజ్జూరు పోలీసుల దాడి ఇందిరమ్మ ఇళ్లతో పేదల ఇంట వెలుగులు.. సొంతింటి కల సాకారం : సొసైటీ చైర్మన్ రఘునాథ్ రెడ్డి శ్రీరామ్ చినబాబును సన్మానించిన జబ్బల మీనా : పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్న నేతలు

ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

Select Suryaa Now
ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు


-ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి పాలన
-ఎమ్మెల్యే సామేల్ తోనే తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధి 
- సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య 
తిరుమలగిరి మేజర్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను తిరుమలగిరి మండల కేంద్రంలో  తిరుమలగిరి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.  సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య, తిరుమలగిరి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుంకరి జనార్దన్, మున్సిపాలిటీ అధ్యక్షులు కేసిడి  వెంకట లక్ష్మారెడ్డి లు నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి, బాణాసంచాలు కాలుస్తూ, ఒకరికొకరు స్వీట్లు పంచిపెట్టి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందని కొనియాడారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరేలా ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తూ, ప్రజా పాలనను విజయవంతంగా కొనసాగిస్తున్నారని ప్రశంసించారు. రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం మరింత సుభిక్షంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మండల పార్టీ అధ్యక్షులు సుంకరి జనార్దన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, ఎమ్మెల్యే మందుల సామెల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతున్నారని నరసయ్య స్పష్టం చేశారు. నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను నేడు ఎమ్మెల్యే సామెల్ చొరవతో పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి, మంత్రుల నియోజకవర్గాలతో సమానంగా తుంగతుర్తికి కూడా నిధులు, ప్రాజెక్టులు మంజూరవుతున్నాయని వివరించారు. మున్సిపాలిటీ అధ్యక్షులు కేసిడి వెంకటలక్ష్మారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గానికి వరాల జల్లు.. ఇందిరమ్మ ఇండ్లు ఒక వరం అని నియోజకవర్గానికి జూనియర్ కళాశాల, ఇంటిగ్రేటెడ్ స్కూల్, తెలంగాణ పబ్లిక్ స్కూల్, వంద పడకల ఆసుపత్రి, గోదాములు, ఇండస్ట్రియల్ పార్క్, ప్రభుత్వ భవనాల నిర్మాణాలు వంటి భారీ ప్రాజెక్టులు వస్తున్నాయని నరసయ్య పేర్కొన్నారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఒక గొప్ప వరమని, లబ్ధిదారులు జీవితకాలం సీఎం రేవంత్ రెడ్డిని, ఎమ్మెల్యే మందుల సామెల్‌ను గుండెల్లో పెట్టుకుంటారని అన్నారు. నిత్యం ప్రజల మధ్యే ఉంటూ ప్రజాసేవ చేస్తున్న ఎమ్మెల్యే సామెల్ సారధ్యంలో తుంగతుర్తి నియోజకవర్గం వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్సి చైర్మన్ పాలపు చంద్రశేఖర్, కౌన్సిలర్లు తిరుమణి యాదగిరి,  కేసిడి  కవిత రెడ్డి, బత్తుల శ్రీను, మల్లయ్య, మాజీ మండల అధ్యక్షుడు ఎల్సొజు నరేష్, జుమ్మిలాల్, కందుకూరి లక్ష్మయ్య, కందుకూరి నాగార్జున, శోభారాణి, సతీష్ గౌడ్, భాస్కర్ నాయక్, కిష్టు నాయక్, హీరు నాయక్, పిఎన్ఆర్, అబ్బాస్, సుధాకర్, వంశీ, గంగాధర్, యాకన్న, సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.