సూర్య,కౌటాల : మండలంలోని మొగడ్ ధగడ్, ముత్తంపెట్, తాటిపల్లి, గురుడపేట గ్రామాలలో సోమవారం శ్రీ సత్య సాయి బాబా 101 వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు మొగడ్ ధగడ్ గ్రామంలో సత్యసాయి బాబా పల్లకి సేవ ఊరేగింపులో భాగంగా భజన కీర్తనలు ఆలపిస్తూ గ్రామంలోని వీధుల గుండా శోభ యాత్ర నిర్వహించారు. అదేవిధంగా సోమవారం ఉదయం ఐదు గంటలకు సుప్రభాతం,నగర సంకీర్తన సేవలు, దీపోత్సవం, భజన, మంగళహారతి కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం బాలవికాస్ చిన్నారులతో నృత్యాలు, భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి బాబా ఆలయంలో సత్యసాయి సేవ సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి భక్తులు చుద్రి మనిరాం, గర్రేపలి ప్రభాకర్, ఏలకార్ దిలీప్, నరులే విలాస్, బొమ్మకంటి మనీష్, శంకర్,కొమురెల్లి మహేందర్, భాస్కర్, నిఖిల్, భక్తులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.