BREAKING
తీవ్ర తుఫానుకు తల్లడిల్లుతున్న వృద్ధ దంపతులు.. ఎగిరిపోయిన ఇంటి పైకప్పు! 32వ వార్డులో ఫ్యాన్ హోరు - గోల్డ్ ఇస్మాయిల్ కు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు బీజేపీ కందుకూరు మండల ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా అంబటి కృష్ణ నీళ్లలో సాహసించి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించిన సిబ్బంది ఇచ్చిన హామీలకే దిక్కులేదు..మళ్ళీ కొత్త హామిలా మాజీ మేయర్ వసీం మంచాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి ప్రాణాలకు తెగించి నీళ్లలో దిగి విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ: డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు.. కళ్లద్దాల పంపిణీ ఇజ్రాయెల్ ఎన్నికల్లో ఉత్కంఠ.. నెతన్యాహు మళ్లీ అధికారంలోకి వస్తారా? కుటుంబంతో కలిసి నవ్వుతూ ఎంజాయ్ చేసే సినిమా ఇది.. దొంగ నా కొడుకు సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరో మౌళి కౌసర్ విజయానికి కూటమి బాటలు.. 32వ డివిజన్లో బిజెపి జనసేన టిడిపి నాయకుల విస్తృత ప్రచారం మోదీపై వ్యక్తిగత విమర్శలు సరికాదుః ఖర్గే వ్యాఖ్యలను ఖండించిన బీసీ సంఘాలు 47 ఏళ్ల తర్వాత కలవనున్న దిగ్గజాలు.. నెట్‌ఫ్లిక్స్ మెగావర్స్ షోలో చిరంజీవి, కమల్ హాసన్ సందడి మార్పు దిశగా ప్రపంచ దేశాలు న్యూ నలంద పాఠశాలలో ఈ-వేస్ట్ సేకరణ డ్రైవ్

ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలి -మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి

Select Suryaa Now
ఎన్ హెచ్ ఎం  ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలి -మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి

Lఎన్ హెచ్ ఎం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద ఎన్ హెచ్ ఎం జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరవధిక సమ్మె బుధవారం 16వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణలో ఎన్ హెచ్ ఎం  ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా వైద్య సేవలు అందిస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎన్ హెచ్ ఎం జేఏసీ జిల్లా అధ్యక్షుడు డా. బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి దామగట్ల కుమార్, సభ్యులు హైమావతి, డాక్టర్ జగన్, బీముడు, డాక్టర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
పి.వినయ్ కుమార్, నాగర్‌కర్నూల్ క్రైమ్, సూర్య న్యూస్