ఎమ్మెల్యే పాయం ఆధ్వర్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు
మణుగూరు ఆర్ సి సూర్య ; మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పినపాక ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు పాల్గొని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని, ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.ప్రజల సంక్షేమం,రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా మంత్రి చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు.ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేస్తూ, ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.
పొనగంటి కృష్ణ మణుగూరు ఆర్ సి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా