BREAKING
పులిరామన్నగూడెం ఎంపీటీసీ అభ్యర్థిగా బన్నే పూర్ణ కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలి భీమవరం జెడ్పీటీసీగా కత్తుల సిరి మహాలక్ష్మి, వీరవాసరం ఎంపీపీగా భోగిరెడ్డి శ్రీనివాసరావు విజయాలను తెచ్చే కనకదుర్గమ్మ ఆశీషులు ప్రజలందరిపై ఉండాలి 'చెప్పాం – చేస్తున్నాం' బ్రోచర్ ఆవిష్కరణ: కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం – టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ళ నాగేశ్వర రావు విజయదశమి సందర్భంగా ఘనంగా ఆయుధ, వాహన పూజలు పోలీసు శాఖ ప్రజలకు మెరుగైన సేవలందించాలి: ఎస్పీ అద్నాన్ నయీం అస్మి జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఎన్నికల నిర్వహణలో నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వ్యవహరించాలి: కలెక్టర్ నాగరాణి కూటమి చైర్మన్ అభ్యర్థిగా శ్రీరామ్ చినబాబుకి బి-ఫారం : అందజేసిన ఎమ్మెల్యే జహా,టీడీపీ జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు మెట్లకుంటలో దుర్గామాత చీర రూ.30 వేలకు వేలం.. దక్కించుకున్న చౌదర్పల్లి గోపాల్–అనిత దంపతులు ఇల్లెందు లోరాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన- పలు అభివృద్ధి పనులకు శ్రీకారం పేకాట స్థావరం పై పోలీసుల మెరుపు దాడి చేసిన పొన్నూరు అర్బన్ పోలీసులు -అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు...... అర్బన్ సీఐ ఆర్ఎస్ కిషోర్ కుమార్ చెరుకులపాడులో వైఎస్ఆర్సీపీ ఐడీ కార్డుల పంపిణీ దసరా పర్వదినోత్సవాన.. జమలాపురం వేంకటేశ్వరస్వామి, తక్కెళ్లపాడు లలితా రాజరాజేశ్వరి అమ్మవారికి మంత్రి పొంగులేటి కుటుంబం ప్రత్యేక పూజలు దసరా వేళ స్వగ్రామానికి పొంగులేటి.. నారాయణపురంలో పండుగ సందడి భక్తిశ్రద్ధలతో..రేజర్లలో శివాద్రి గిరి ప్రదక్షిణ ప్రారంభం దుర్గా నాగమల్లేశ్వర స్వామికి మంత్రి పొంగులేటి ప్రత్యేక పూజలు విజయదశమి సందర్భంగా అఖండ అన్న సమారాధన ప్రారంభం కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ సతీమణి వెంకట శ్రీదేవి చేతుల మీదుగా ప్రారంభం

ఈనెల 26న చలో హైదరాబాద్ కు వేలాదిగా తరలి రండి

Select Suryaa Now
ఈనెల 26న చలో హైదరాబాద్ కు వేలాదిగా తరలి రండి

పరకాల, మేజర్ న్యూస్, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాల పెంపుదల పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 26 న జరిగే చలో హైదరాబాద్ (ఇంద్ర పార్క్) కు కార్మికులు వేలాదిగా తరలి రావాలని సిఐటియు జిల్లా కోశాధికారి బొట్ల చక్రపాణి పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో కార్మికులతో కలిసి చలో హైదరాబాద్ పోస్టర్ ను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో వచ్చిన హామీలు రెండు  సంవత్సరాలు గడిచిన అమలు చేయకపోవడం, వేతనాలు పెంచకపోవడం తో కార్మికుల ఆశలు అడియాశయ్యాయని ఆయన అన్నారు. తక్షణమే పిఆర్సి ప్రకటించి గ్రామపంచాయతీ మున్సిపాలిటీ, ఆశా, అంగన్వాడి మధ్యాహ్న భోజనం తదితర రంగాల కార్మికులకు కనీస వేతనం 30 వేల రూపాయలుగా నిర్ణయించి అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అసంఘటితరంగా కార్మికులైన హమాలీ ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేసి వారిని ఆదుకోవాలని ఆయన కోరారు. 50 సంవత్సరాలు పైబడిన వారికి పెన్షన్ ఉద్యోగ భద్రత ఈఎస్ఐ, పిఎఫ్ లాంటి చట్టబద్ధ హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూల్స్ తయారు చేసింది. దీనివలన కార్మికులకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని అందుకే ఈ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని ఆయన కోరారు.  సమస్యల సాధన కోసం జరిగే చెలో హైదరాబాద్ కు జిల్లాలోని కార్మికులందరూ అధిక సంఖ్యలో తరలిరావాలని చక్రపాణి పిలుపునిచ్చారు. 
కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ పల్లె రామన్న ,మండల నాయకులు పోషణ పల్లి రవి, కొడారి రమేష్ , జి లక్ష్మీనారాయణ, వై. లక్ష్మయ్య, జి. భాస్కర్, జి .కుమార్, కిన్నర, దేవేందర్ ,దుప్పటి జంపయ్య తదితరులు పాల్గొన్నారు

రిపోర్టర్ :,పురుషోత్తం, పరకాల హనుమకొండ జిల్లా