BREAKING
మనసును హత్తుకునేలా మనోజ్ వాజ్ పేయ్ 'దిల్వాలి దివాలి' మూవీ.. నెట్‌ఫ్లిక్స్‌లో ఆకట్టుకుంటున్న ఫ్యామిలీ డ్రామా! బియ్యం ధరల దోపిడీపై తెలంగాణ ప్రభుత్వ ఉక్కుపాదం: రాష్ట్రవ్యాప్తంగా దాడులు – 370 కేసులు నమోదు జిల్లాకేంద్రంలో నిర్మల్ జిల్లా ఆర్ఎంపీ ల అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక : పదోతరగతివిద్యార్థులకు ఉచితంగా అన్ని అంశాల చదువు పుస్తకాల పంపిణీ పెండింగ్ పనుల్లో జాప్యం చేయొద్దు సోలక్ పల్లి లో ఉచిత వైద్య శిబిరం కోదాడ నియోజకవర్గంలో 219 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. తుఫాన్ బాధితులకు అండగా ప్రభుత్వం. ఎల్లంపేట మున్సిపాలిటీలో అంపశయ్యపై సమాచార హక్కు చట్టం.. మూడుసార్లు దరఖాస్తు చేసినా సమాచారం ఏదీ..? రైల్వే గేటు పడితే ట్రాఫిక్ కష్టాలే.. కిలోమీటర్ల మేర నిలిచిపోతున్న వాహనాలు అక్బర్జపేట్‌లో హరితహారం మొక్కల విధ్వంసం.. 150కి పైగా మొక్కలు ధ్వంసమైనా పట్టించుకునేవారేరి..? ఎంపీ సురేష్ కుమార్ షట్కర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కోహిర్ మండల కాంగ్రెస్ నాయకులు వైద్య చికిత్సకు రూ.2 లక్షల ఎల్‌ఓసీ చెక్కు అందజేత క్రెడిట్ సొసైటీ మేనేజర్ మృతి పై విచారణ జరపాలి కారు బైకు ఢీ తండ్రి మృతి కొడుకుకి తీవ్ర గాయాలు

ఈఎస్ఐలో రూ.50 కోట్ల కుంభకోణం : ఈఎస్ఐసీ బోర్డు సభ్యుడు వేముల మారయ్య ఆరోపణ

Select Suryaa Now
ఈఎస్ఐలో రూ.50 కోట్ల కుంభకోణం : ఈఎస్ఐసీ బోర్డు సభ్యుడు వేముల మారయ్య ఆరోపణ

 

హెచ్‌ఎంటీ నగర్‌, నవంబరు 6: కార్మికుల ఆరోగ్య సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన ఈఎస్ఐ వైద్య వ్యవస్థలో భారీ అవినీతి చోటుచేసుకుంటోందని ఈఎస్ఐసీ బోర్డు సభ్యుడు, భారత ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల మారయ్య ఆరోపించారు. ఈఎస్ఐ ఆసుపత్రులు, డిస్పెన్సరీల్లో పారిశుద్ధ్య నిర్వహణ కాంట్రాక్టుల పేరుతో సుమారు రూ.50 కోట్ల మేర అక్రమాలు జరిగాయని, ఒక్క ప్రస్తుత సంవత్సరంలోనే రూ.30 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఏసీబీతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం హెచ్‌ఎంటీ నగర్‌లోని తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఐఎంఎస్‌ జాయింట్‌ డైరెక్టర్‌ గౌతమ్‌ తనకు నచ్చిన వ్యక్తులకు నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్‌ పద్ధతిలో కాంట్రాక్టులు కట్టబెడుతూ ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో చదరపు అడుగుకు రూ.5 నుంచి రూ.10 వరకు ఉన్న పారిశుద్ధ్య నిర్వహణ వ్యయాన్ని ప్రస్తుతం రూ.72 నుంచి రూ.136 వరకు పెంచి చెల్లిస్తున్నారని విమర్శించారు. ఆన్‌లైన్‌ టెండర్లు, పారదర్శక ఒప్పందాలకు బదులుగా నచ్చిన వారికి పనులు అప్పగిస్తున్నారని ఆరోపించారు.

నాచారం, జీడిమెట్ల, పటాన్‌చెరు, వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌ తదితర ప్రాంతాల్లోని ఈఎస్ఐ ఆసుపత్రులు, డిస్పెన్సరీల పారిశుద్ధ్య కాంట్రాక్టుల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని తెలిపారు. కాంట్రాక్టు కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించకపోవడంతో వారు ఆందోళనలకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

వైద్య సేవల్లోనూ నిర్లక్ష్యం

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25 లక్షల మంది, హైదరాబాద్‌లోనే 15 లక్షల మంది కార్మికులు ఈఎస్ఐ పరిధిలో ఉన్నారని మారయ్య తెలిపారు. కార్మికులు, యాజమాన్యాలు చెల్లిస్తున్న నిధులతో మెరుగైన వైద్య సేవలు అందించాల్సి ఉండగా, ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. క్యాన్సర్‌ బాధితులకు అవసరమైన మందులు అందుబాటులో లేకపోవడం, సనత్‌నగర్‌ ఈఎస్ఐ ఆసుపత్రితో పాటు ఇతర కేంద్రాల్లో సీటీ స్కాన్‌, ఎంఆర్ఐ పరీక్షల సదుపాయాలు లేకపోవడం వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.

అత్యవసర పరిస్థితుల్లోనూ వైద్య పరీక్షలు వెంటనే నిర్వహించకుండా మరుసటి రోజు రావాలని చెబుతున్నారని, దీనివల్ల రోగుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మిర్యాలగూడలో అద్దె భవనంలో కొనసాగుతున్న ఈఎస్ఐ డిస్పెన్సరీకి అద్దె చెల్లించకపోవడంతో యజమాని తాళం వేయగా, వైద్యం కోసం వచ్చిన కార్మికులు ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. కొందరు వైద్యులు విధులకు సక్రమంగా హాజరుకాకుండా ప్రైవేటు క్లినిక్‌లపై దృష్టి సారిస్తున్నారని ఆరోపించారు.

ఉద్యమం ఉధృతం చేస్తాం

ఈఎస్ఐలో జరుగుతున్న అవినీతి, వైద్య సేవల్లో వైఫల్యాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని మారయ్య డిమాండ్‌ చేశారు. జాయింట్‌ డైరెక్టర్‌ గౌతమ్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని, సంబంధిత ఉన్నతాధికారులపైనా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వ్యవహారంపై ఏసీబీతో విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించడంతో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో హరిబాబు తదితరులు పాల్గొన్నారు.