దసరా శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
సూర్య ఖమ్మం దసరా పండుగను పురస్కరించుకొని ప్రజలకు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. తొమ్మిది రోజుల బతుకమ్మ సంబురాలతోపాటు దేవీ శరన్నవరాత్రుల దుర్గమ్మ పూజల పర్వదినాలకు కొనసాగింపుగా విజయ దశమిగా జరుపుకునే దసరా పండుగకు తెలంగాణ ప్రజా జీవనంలో ప్రత్యేక స్థానం ఉన్నదని చెప్పారు. కార్యదీక్షులను అపజయాల నుంచి విజయాల దిశగా నడిపిస్తూ, ఏనాటికైనా ధర్మానిదే అసలు విజయం అనే స్ఫూర్తిని దసరా పండుగ మనకు అందిస్తున్నదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో బతుకమ్మతోపాటు విజయ దశమి స్ఫూర్తి ఇమిడి ఉన్నదని, అదే స్ఫూర్తితో బీఆర్ఎస్ పాలనలో ప్రజలను విజయాల దిశగా నడిపించామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల జీవితాలు ఓటమి నుంచి గెలుపు దిశగా పయనించాలని ఆకాంక్షిస్తూ నిత్య శుభాలతో ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు నిండేలా దీవించాలని దుర్గామాతను మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రార్థించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్ పసుపులేటి సత్యనారాయణ