BREAKING
ప్రియాంక చోప్రా కోసం టూర్ షెడ్యూల్ మార్చుకున్న నిక్ జోనాస్.. అరుదైన రీతిలో కల్వా చౌత్ వేడుకలు బాలీవుడ్‌లో నాకంటూ సరైన స్థానం లేదు.. చిత్ర పరిశ్రమకు దూరంగా ఉండటమే మేలంటున్న దర్శకుడు అమోల్ గుప్తే చారిత్రాత్మక శతకంతో రికార్డుల వేట సాగించిన ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు.. ఇంకా వంద ముప్పై ఎనిమిది పరుగుల వెనుకంజలో వెస్టిండీస్ తిరుపతిలో కూటమి హవా - ప్రచారంలో దూసుకుపోతున్న మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ సౌతాఫ్రికాతో మూడో టెస్టులో కీలక ఆధిక్యం సాధించిన ఆస్ట్రేలియా సెంచరీతో చెలరేగిన బెన్ డకెట్.. శ్రీలంక ముందు భారీ లక్ష్యాన్ని ఉంచిన ఇంగ్లండ్ కంబదూరులో రాజకీయ వేడి... జనసేన జడ్పిటిసి అభ్యర్థికి టిడిపి పూర్తి మద్దతు. ప్రజా సమస్యలను పరిష్కరించడమే నా ద్వేయం.. 16వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఆర్. నాగభూషణం కటారి హేమలతను అత్యధిక మెజారిటీతో గెలిపించండి ఫైనాన్స్ ఆఫీసర్ గా సర్దార్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఐర్లాండ్ లెగ్ స్పిన్నర్ బెన్ వైట్ శ్రీరామలో మహిళల చెస్ క్రీడాకారుల ఎంపికలు టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన రికార్డుకు అడుగు దూరంలో తిరుచానూరులో చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి ఇంటింటి ప్రచారం కరోనా సేవలను గుర్తు చేసుకున్న స్థానికులు..

చట్టాలపై అవగాహనతోనే హక్కులకు రక్షణ

Select Suryaa Now
చట్టాలపై అవగాహనతోనే హక్కులకు రక్షణ
సూర్య, మందమర్రి. విద్యార్థులు తమ హక్కులు, బాధ్యతలపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు, చట్టాలను గౌరవిస్తూ బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎం.డి. సంధాని, ఆర్. శ్రీనివాస్, సబ్బాని సదయ్య, ఎ. రాములు సూచించారు. గురువారం మందమర్రి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంచిర్యాల జిల్లా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టం ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ అవగాహన కార్యక్రమంలో వారు విద్యార్థులకు పలు చట్టాలపై వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్ కె. శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పోక్సో చట్టం, ర్యాగింగ్ నిరోధక చట్టం, బాల్యవివాహాల నిషేధ చట్టం, కార్మిక చట్టాలు, మోటారు వాహనాల చట్టాల ప్రాధాన్యతను వివరించారు. చట్టాల ఉల్లంఘన వల్ల ఎదురయ్యే పరిణామాలు, బాధితులకు చట్టపరంగా లభించే రక్షణ, న్యాయ సహాయం పొందే మార్గాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చట్టాలపై అవగాహన కలిగి ఉండటం ద్వారా అన్యాయాన్ని ఎదుర్కొనే ధైర్యం వస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడకుండా, బాల్యవివాహాలను ప్రోత్సహించకుండా ఉండాలని, రహదారి భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఎవరైనా అన్యాయానికి గురైతే మౌనంగా ఉండకుండా, భయపడకుండా సంబంధిత అధికారులను సంప్రదించి న్యాయ సహాయం పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.