BREAKING
మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి ప్రాచీన్ గ్లోబల్ హాస్పిటల్ ప్రారంభించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ అంజిరెడ్డి గుప్తా ఫౌండేషన్ అధినేత మడుపల్లి మోహన్ గుప్తాకు పద్మశ్రీ లేదా పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వాలి టిడిపి జడ్పిటిసి అభ్యర్థి శ్రీనివాసవర్మ విస్తృత ప్రచారం రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లుమారేపల్లి సొసైటీ చైర్మన్‌ రాజు బొల్లారంలో ఇందిర గాంధీ వర్ధంతి వేడుకలు గుట్టపాడులో టీడీపీ ఎన్నికల ప్రచారం బాలికకు అండగా.. బెంగళూరుకు లోకేష్ రాప్తాడు పాఠశాలలో విద్యార్థినిపై దాడి అమానుషం.. ఏపీ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయభాస్కర్ కక్షిదారులకి సత్వరమే న్యాయం అందలి -- తెలంగాణ రాష్ట్ర గౌరవ హై కోర్టు జర్జి గాడి ప్రవీణ్ కుమార్ బస్ డిపో కై స్థలాన్ని కేటాయించాలి బాలాజీ ఫార్మసీ కళాశాలలో కృత్రిమ మేధస్సుపై జాతీయ సదస్సు మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ---నషా ముక్త్ భారత్ అభియాన్ కమిటీ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్ ఎమ్మెల్యే జారె ఆదినారాయణను మర్యాదపూర్వకంగా కలిసిన కొప్పుల రాంబాబు* ఉపసంహరించుకున్న అభ్యర్థికి మ్యాండిట్ ఎలా ఇచ్చారు? --ఎంపీటీసీ అభ్యర్థుల ఆరోపణ

చదువుతో పాటు క్రీడలు ముఖ్యమే!

Select Suryaa Now
చదువుతో పాటు క్రీడలు ముఖ్యమే!

నారాయణ పాఠశాలలో ఘనంగా నారాయణ ప్రీమియం లీగ్ స్పోర్ట్స్ నిర్వహణ

శంకర్ పల్లి : విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమని శంకర్పల్లి ఎంఈఓ రవీందర్, ఎస్సై సురేష్ లు అన్నారు. శనివారం రోజున శంకర్ పల్లి లోని నారాయణ పాఠశాలలో నారాయణ ప్రీమియం లీగ్ స్పోర్ట్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు ఆటలు ఆడితేనే శారీరక వ్యాయామంతో పాటు మానసిక ఆనందం కలుగుతుందని అన్నారు. విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలకు కూడా ఉపాధ్యాయులు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మండల ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ చైర్మన్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ నారాయణ పాఠశాలలో నారాయణ ప్రీమియం లీగ్ సందర్భంగా శంకర్పల్లి తో పాటు వికారాబాద్, సంగారెడ్డి, తాండూర్ పాఠశాలల విద్యార్థులను కలుపుకొని ఇక్కడ పోటీలు నిర్వహించడం సంతోషకరమైన అన్నారు. ఇలాగే శంకరపల్లి మండలంలోని అన్ని స్కూల్స్ లోని విద్యార్థులకు సంవత్సరానికి ఒకసారి కలిపి స్పోర్ట్స్ నిర్వహించాలని ఎంఈవోను కోరారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు చదువుతోపాటు క్రీడల పట్ల కూడా ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. జిఎం గోపాల్ రెడ్డి, డీజీఎం వల్లి కుమార్ మాట్లాడుతూ ఆటల్లో గెలుపు, ఓటములు సహజమని అన్నారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. నారాయణ విద్యాసంస్థల్లో చదువుతోపాటు క్రీడలకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జోన్  ప్రిన్సిపల్ దివ్య, తెరిసా జాన్సన్, అశోక్, భవ్య, వికారాబాద్ జోన్ కోఆర్డినేటర్ కనకరాజు, సమతా రాణి, ఆఫ్రిన్, వికారాబాద్ జోన్ అకాడమిక్ డిన్స్ సంగమేశ్వర్, అశోక్, శ్రీకాంత్, ఏవోలు రాజేందర్ రెడ్డి, రమేష్, భీమయ్య, పి ఈ టి లు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మాడిశెట్టి రాజశేఖర్, మేజర్ న్యూస్ :శంకర్పల్లి