BREAKING
మాజీ లాయర్ అలినా హబ్బా 50 మిలియన్ డాలర్ల కాంట్రాక్ట్‌పై ట్రంప్ ఆగ్రహం ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ అత్యాధునిక ఎంఆర్ఐ సేవలు! ఓటు హక్కును వినియోగించుకున్న బీవీ దంపతులు Weekly Horoscope (వార ఫలాలు) 01 Nov 2026 - 07 Nov 2026 వరకు by Dr Edupuganti Padmaja Rani అర్నాబ్ తుఫాన్ ప్రభావం: పశ్చిమగోదావరి జిల్లాలో పంట నష్టాలు – రైతులను ఆదుకోవాలని డిమాండ్ మార్షల్ ఆర్ట్స్‌తో ఆత్మరక్షణ, క్రమశిక్షణ అలవడతాయి ** కరస్పాండెంట్ బైరు కొండల్ రెడ్డి చీరాలలోని 88 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు ప్రారంభం విద్యార్థుల ఇళ్లకు వెళ్లి మానసిక ధైర్యం, భద్రతపై భరోసా కల్పించేలా విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ చర్యలు నవంబర్ 28న నవోదయ ఆరో తరగతి ప్రవేశ పరీక్ష.. హాల్‌టికెట్లు విడుదల కదిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ దంపతులు ప్రశాంతంగా ప్రారంభమైన పోలింగ్: ఓల్డ్ టౌన్ లో ఓటర్ల ఉత్సాహం తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీజీ స్పాట్ అడ్మిషన్లు 10 కోర్సుల్లో 378 ఖాళీ సీట్లు.. నవంబర్ 7న ప్రవేశాల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికలు

బ్రహ్మగిరి క్షేత్రంలో శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకరణ

Select Suryaa Now
బ్రహ్మగిరి క్షేత్రంలో శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకరణ

చేవెళ్ల: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు బ్రహ్మగిరి క్షేత్రం, చేవెళ్లలో శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకరణ భక్తులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఉదయం అమ్మవారికి పంచామృత అభిషేకాలు నిర్వహించి, కుంకుమ అలంకరణతో విశేషంగా అలంకరించారు. అనంతరం శ్రీచక్ర కుంకుమార్చన, అమ్మవారి అష్టోత్తర శతనామావళి పఠనం నిర్వహించారు. చివరిగా మహా మంగళహారతి సమర్పించి పూజా కార్యక్రమాలను ముగించారు.

శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తి చూపుతున్నారు. అమ్మవారి కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని భక్తులు ప్రార్థించారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

(చేవెళ్ల - మేజర్ న్యూస్)