భార్య ఆత్మహత్య కేసులో భర్త అరెస్ట్
*కడ్తాల్ రంగారెడ్డి
కడ్తాల్ మండలం మక్తమాదారం గ్రామంలో భార్య లావణ్య (29) ను వేధించి ఆత్మహత్యకు ప్రేరేపించిన భర్త ఎగిరిశెట్టి ఆంజనేయులును కడ్తాల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
మద్యం సేవించి వచ్చి భార్యపై దాడి చేయడంతో మనస్తాపం చెంది లావణ్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ వి. సైదిరెడ్డి తెలిపారు.