BREAKING
సాండ్‌పేపర్ వివాదంపై డేవిడ్ వార్నర్ సంచలన ఆరోపణలు.. స్టార్క్, లయన్, హేజిల్‌వుడ్‌లను విచారించలేదంటూ క్రికెట్ ఆస్ట్రేలియాపై ఫైర్ 10వ తరగతి ఫలితాలు పై ప్రత్యేక దృష్టి టీ20 ఫార్మాట్‌లో వ్యూహాత్మక మార్పులే కీలకం.. కర్ణాటక యువ బ్యాటర్ స్మరన్ రవిచంద్రన్ ఆసక్తికర వ్యాఖ్యలు దివ్య కుటుంబానికి అండగా ఉంగుటూరు ఎమ్మెల్యే, జనసేన నాయకులు యాదవోలులో కేంద్ర బృందం పర్యటన ఘనముగా గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం ఆర్థిక ప్రమాదాలను నివారించడానికి క్రమమైన వడ్డీ రేట్ల పెంపే ఉత్తమం జెన్సన్ హువాంగ్ లేకపోతే కీలక ఒప్పందాలను కోల్పోనున్న ఎన్విడియా 73 ఏళ్ల నిరీక్షనకు తెరదించుతూ న్యూజిలాండ్‌పై అద్భుత విజయం సాధించిన వేల్స్ జాతీయ రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి అమెరికాలో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం 1998 తర్వాత తొలిసారిగా అలాస్కాలో గెలుపొందిన డెమొక్రాటిక్ గవర్నర్ స్పేస్‌ఎక్స్ ఇంటర్నెట్ స్పీడ్ పరిమితులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్ర ఆగ్రహం జిల్లా ఆసుపత్రిలో డబ్బులు అడిగితే ఫోన్ చేయండి – ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కొండ శ్రీధర్ నశా ముక్త్ భారత్ బ్లాక్ స్థాయి క్రీడలు విజయవంతం

బీజేపీ నాయకుల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం – మల్లేష్ గంగ్వార్

Select Suryaa Now
బీజేపీ నాయకుల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం – మల్లేష్ గంగ్వార్

న్యాల్కల్ ;కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా బీజేపీ నాయకులను పోలీసులు అరెస్టు చేయడాన్ని న్యాల్కల్ మండల బీజేపీ అధ్యక్షులు మల్లేష్ గంగ్వార్ తీవ్రంగా ఖండించారు.న్యాల్కల్ మండల బీజేపీ అధ్యక్షులు మల్లేష్ గంగ్వార్, బీజేపీ జిల్లా నాయకులు మధుసూదన్ రెడ్డి, మండల సీనియర్ నాయకులు వీరారెడ్డి, ఆనంద్ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేసి హద్నూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.ఎలాంటి తప్పు చేయని బీజేపీ నాయకులను ముందస్తు చర్యల పేరుతో అరెస్టు చేయడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని ఆయన అన్నారు. ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కేందుకు పోలీసు వ్యవస్థను ఉపయోగించుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే హక్కు, నిరసన తెలిపే హక్కు ఉన్నాయని, ఆ హక్కులను కాలరాసే విధంగా వ్యవహరించడం సరికాదని అన్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలను మానుకొని, అరెస్టు చేసిన బీజేపీ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.అక్రమ అరెస్టులతో బీజేపీ నాయకుల పోరాట స్ఫూర్తిని అణచివేయలేరని, ప్రజల పక్షాన, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని హెచ్చరించారు.