BREAKING
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా కార్యక్రమం ప్రారంభించిన బెజ్జూర్ సర్పంచ్ దుర్గం సరోజ తిరుపతి ఎన్నికల వేళ అప్రమత్తం.. గ్రామాల్లో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ ఎస్సై పి. సూర్యకుమారి ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రత పేద కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా భరోసా –ప్రజా ప్రభుత్వానికి అభినందనలు:* న్యాయవాది అశ్వినికి గ్రామస్తుల ఘన సన్మానం శ్రీకాకుళం జిల్లాకు కనీసం రూ.100 కోట్ల నిధులు కూడా తీసుకురాలేనీ ప్రభుత్వం:మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అవినీతి లేని పాలన అందిస్తా.. అభివృద్ధికి అంకితమవుతా...! సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించాలని బొమ్మన రవీంద్రనాథ్ రెడ్డి పట్టణ ప్రజలకు విజ్ఞప్తి..... మంత్రతంత్రాల పేరుతో రూ.లక్షల్లో టోకరా - అంతర్రాష్ట్ర ముఠాలో ఐదుగురి అరెస్టు షీలానగర్లో గుర్తుతెలియని మృతదేహం లభ్యం కదిరి మున్సిపల్ చైర్ పర్సన్ అర్షియా భాను ప్రమాణ స్వీకారం నూతన మున్సిపల్ చైర్మన్ నల్లా శ్రీధర్‌కు బొలిశెట్టి సత్య అభినందనలు.... థాయ్‌లాండ్‌లో ప్రతిపక్ష ఎంపీకి భారీ ఊరట దక్షిణ కొరియా కేబినెట్‌లో కీలక మార్పులు ఉక్రెయిన్‌లోని కీవ్ ప్రాంతంలో రష్యా భీకర దాడి మున్సిపాలిటీ వైస్ చైర్మన్‌గా వాసంశెట్టి వెంకటరమణారావు ఢిల్లీ వైపు సాగుతున్న భారత్-శ్రీలంక సైక్లింగ్ యాత్ర

బీఆర్‌ఎస్‌, బీజేపీ వికృత చేష్టలు

Select Suryaa Now
బీఆర్‌ఎస్‌, బీజేపీ వికృత చేష్టలు

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల తీరుపై కాంగ్రెస్‌ నేతలు అద్దంకి దయాకర్‌ తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్షాలు చీప్‌గా ప్రవర్తిస్తున్నాయని, కేటీఆర్‌, అర్వింద్‌ చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. వారిద్దరూ రాజకీయంగా ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారని వ్యాఖ్యానించారు.

ప్రజల గుండెల్లో నుంచి కేసీఆర్‌ వెళ్లిపోయారని అద్దంకి దయాకర్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ నేతలు విషనాగులుగా మారారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ క్యాడర్‌ను బద్దలు కొట్టడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యమని పేర్కొన్నారు.

కేటీఆర్‌కు రాజకీయ భవిష్యత్‌ లేదని అద్దంకి దయాకర్‌ వ్యాఖ్యానించారు. ఈ నెల 30వ తేదీ నుంచి కేటీఆర్‌కు నిద్ర పట్టదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యర్థుల విమర్శలను రాజకీయంగా ఎదుర్కొంటామని, కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం ఉందని ఆయన పేర్కొన్నారు.