BREAKING
నేటి రాశి ఫలాలు –21 అక్టోబర్ 2026 అగ్నిప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్యెల్యే ఉగ్ర నరసింహారెడ్డి దసరా ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసేలా పటిష్ట బందోబస్తు మెట్లకుంట దుర్గామాత ఉత్సవాల్లో పోలీసుల సేవలకు సలాం.. ఏఎస్ఐ జైపాల్ రెడ్డికి ఘన సన్మానం పశ్చిమ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులకు బి-ఫారాలు అందజేత వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ మైనార్టీలతో ఆత్మీయ సమావేశం హిందూపురంలో 50 మంది వైసీపీ నుండి టిడిపిలోకి చేరిక సలాం పోలీస్... - పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకోలేం - ఏ ఆపద వచ్చినా మొదట ఆశ్రయించేది పోలీసులనే - సంచలనం సృష్టించిన ఎస్పీ పరదేశి నాయుడు పై మావోల దాడి - అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం మెట్లకుంటలో వైభవంగా దుర్గామాత నిమజ్జన మహోత్సవం.. రూ.51 వేలకు లడ్డూ, రూ.30 వేలకు అమ్మవారి చీర వేలం సంగారెడ్డిలో దసరా వేడుకలకు భారీ ఏర్పాట్లు సిద్దిపేటకు యూనివర్సిటీనే నెక్స్ట్ టార్గెట్..! 16వ వార్డులో టీడీపీ, జనసేన అభ్యర్థులను గెలిపించాలి భవాని మాత యూత్ అసోసియేషన్‌కు ఐదేళ్లుగా చేవెళ్ల మహి చేయూత.. కాసుల మహేందర్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపిన BMYA భారతీనగర్ డివిజన్‌లో ఘనంగా దసరా వేడుకలు ఉయ్యూరు మునిసిపల్ చైర్మన్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్‌ను గెలిపించాలి

బతుకమ్మ సంబరాలతో మార్మోగిన ప్రియదర్శిని కళాశాల ప్రాంగణం

Select Suryaa Now
బతుకమ్మ సంబరాలతో మార్మోగిన ప్రియదర్శిని కళాశాల ప్రాంగణం

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల వైభవానికి అద్దం పట్టిన వేడుకలు

*పూల పండుగకు పట్టం కట్టిన విద్యార్థినులు.. 
*సంప్రదాయాల పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలి — ఛైర్మన్ కాటేపల్లి నవీన్ బాబు

ఖమ్మం రూరల్ సూర్య మేజర్ న్యూస్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిమళాలను వెదజల్లుతూ.. రంగురంగుల పూల అందాలతో.. బతుకమ్మ పాటల సందడితో ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాల అటానమస్ ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది. తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ప్రకృతి ఆరాధనకు, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలను కళాశాలలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. విద్యార్థినులు, మహిళా అధ్యాపకులు సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొని, వివిధ రకాల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి తమ సృజనాత్మకతను చాటుకున్నారు. బతుకమ్మ పాటలు, కోలాటాలు, సంప్రదాయ నృత్యాలతో ప్రాంగణమంతా సందడిగా మారింది. బతుకమ్మలను తీసుకొని నిర్వహించిన ర్యాలీ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ సందర్భంగా కళాశాల ఛైర్మన్ కాటేపల్లి నవీన్ బాబు మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ కేవలం ఒక వేడుక మాత్రమే కాదని, అది తెలంగాణ ప్రజల జీవన విధానానికి, ఆచార వ్యవహారాలకు, ప్రకృతితో ముడిపడిన మన సంస్కృతికి ప్రతిబింబమని పేర్కొన్నారు. పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధించే ఈ పండుగ మహిళల ఐక్యతకు, ఆత్మీయతకు, సామాజిక సమైక్యతకు నిదర్శనమని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్న నేటి విద్యార్థినులు మన సంస్కృతి, సంప్రదాయాలను కూడా గౌరవిస్తూ భావితరాలకు వాటి గొప్పతనాన్ని చాటిచెప్పాలని సూచించారు. ఇలాంటి సాంస్కృతిక వేడుకలు విద్యార్థినుల్లో ఐక్యతా భావాన్ని, నాయకత్వ లక్షణాలను, సంప్రదాయాల పట్ల గౌరవాన్ని పెంపొందిస్తాయని అన్నారు.

కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బత్తుల గోపాల్ మాట్లాడుతూ, ప్రకృతికి, మానవ జీవితానికి ఉన్న విడదీయలేని అనుబంధాన్ని బతుకమ్మ పండుగ చాటిచెబుతుందని పేర్కొన్నారు. ప్రకృతి వనరులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతని, విద్యార్థినులు విద్యతో పాటు పర్యావరణ పరిరక్షణ, సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

అకడమిక్ డైరెక్టర్ అట్లూరి వెంకట రమణ మాట్లాడుతూ, పండుగలు మన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించే వారధులని తెలిపారు. విద్యార్థినుల్లో సృజనాత్మకత, బృంద స్ఫూర్తి, పరస్పర గౌరవం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి ఐ. నరసింహారావు, ఈసీఈ విభాగాధిపతి డి. రమేష్, హెచ్‌అండ్‌ఎస్ విభాగాధిపతి ఎన్. అనిత, ఐక్యూఏసీ ఇన్‌చార్జి ఎన్. జయమ్మ, బీసీఏ విభాగాధిపతి జి. హరికృష్ణ, సాంస్కృతిక కార్యక్రమాల ఇన్‌చార్జి ఆర్.ఎన్. ప్రసాద్, ఫిజికల్ డైరెక్టర్ జి. విల్సన్, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్, ఇతర అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు. అందరి సమష్టి కృషితో బతుకమ్మ సంబరాలు విజయవంతంగా ముగిశాయి. తెలంగాణ సంస్కృతి వైభవాన్ని ప్రతిబింబించిన ఈ వేడుకలు విద్యార్థినుల్లో సంప్రదాయాల పట్ల మరింత చైతన్యాన్ని నింపాయి.