బతుకమ్మ అంటే బతుకునిచ్చే అమ్మ ప్రిన్సిపల్ కే. వీరబాబు
మునగాల, మేజర్ న్యూస్: బతుకమ్మ అంటే బతుకునిచ్చే అమ్మ అని, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ కే. వీరబాబు అన్నారు.శుక్రవారం మండల కేంద్రంలోని పాఠశాల ఆవరణంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు తంగేడు, గునుగు, బంతి, చామంతి పూలతో రంగురంగుల బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మ పాటలు పాడుతూ ఆడిపాడారు. పాఠశాల ఆవరణం పండుగ శోభ సంతరించుకుంది.ప్రిన్సిపల్ వీరబాబు మాట్లాడుతూ బతుకమ్మ కేవలం పూల పండుగ మాత్రమే కాక ప్రకృతిని ఆరాధించే సంప్రదాయమని, మహిళా ఐక్యతకు ప్రతీక అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, ఇలాంటి వేడుకలు సృజనాత్మకతను, సామూహిక భావనను పెంపొందిస్తాయని తెలిపారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు జె. రామకృష్ణ, బి.సైదులు, ఎస్.కె షరీఫ్, పి.వెంకటేశ్వర్లు, ఎస్ కే. జానీ, జి.సుబ్రహ్మణ్యేశ్వరరావు, సిహెచ్ రమేష్, కే.గాయత్రి, సుస్మిత, రంజాన్ బేగం, ఎన్. రామలింగ చారి, విద్యార్థులు పాల్గొన్నారు.