బాలికలు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ నిహారిక
బాలికలు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించి జీవితంలో స్థిరపడాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ సెక్రటరీ, జడ్జి నిహారిక అన్నారు . జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రం లోని జ్ఞానేశ్వర వాస్తల్య మందిరం చిల్డ్రన్ హోమ్ లో అంతర్జాతీయ బాలికల దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా బాలికలు ఎదుర్కొంటున్న లింగ వివక్ష, బాల్య వివాహాలు ,అసమానతల పై సమాజం లో అవగాహన పెంచడం అంతర్జాతీయ బాలికల దినోత్సవం ప్రధాన లక్ష్యం అన్నారు. నేటికి కొన్ని ప్రాంతాలల్లో ఆడపిల్లలకు చదువుకునే అవకాశం దక్కడం లేదని, నాణ్యమైన విద్యను అందించడం, పాఠశాలలు మానేయకుండా చూడాలని అన్నారు. బాలికల పై జరుగుతున్న అత్యాచారాలు, హింసను అరికట్టడం వారికి సరైన పోషకాహారం,వైద్య సదుపాయాలు అందేలా చూడాలి అన్నారు. ఆడ పిల్లలకు సమాన అవకాశాలు కల్పించి, వారిని భవిష్యత్తులో స్వయం సమృద్ధి గల పౌరులుగా తీర్చి దిద్దాలి అన్నారు. జీవితంలో విద్యార్థి దశ అనేది కీలక దశని అందరూ చక్కగా చదువుకొని జీవితంలో గొప్ప స్థాయికి చేరుకోవాలని అన్నారు . బాలికలకు ఏమైనా సహాయం కావాలంటే సంస్థ తరఫున సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు.
పి. వినయ్ కుమార్, నాగర్ కర్నూల్ క్రైమ్, సూర్య న్యూస్