అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు-ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం: కట్టంగూర్ మండలంలో 1,141 మందికి నూతన చేయూత పింఛన్ల పంపిణీ
పేదల సంక్షేమం, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మంగళవారం కట్టంగూర్ మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో నూతనంగా మంజూరైన చేయూత పింఛన్ల ఉత్తర్వుల ప్రతులను 1,141 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు.మండలంలోని 22 గ్రామ పంచాయతీల వారీగా పరిశీలిస్తే కట్టంగూర్‌లో అత్యధికంగా 191 మందికి పింఛన్లు, ఆ తర్వాత ఐతిపాములలో 176, కురుమర్తిలో 86, ఏదులూరులో 73, ముత్యాలమ్మగూడెంలో 72, బొల్లెపల్లిలో 68, దుగ్గెనవల్లిలో 66, మునుకుంట్లలో 59, చెరువుఅన్నారంలో 54, పరడలో 44, కల్మెరలో 38 మందికి, ఇస్మాయిల్‌పల్లి, పామనగుండ్లలో 29, నారేగూడెం, ఎర్రసానిగూడలో 24 పిట్టంపల్లిలో 21, గర్లబాయిగూడెం, మల్లారంలో 18, రామచంద్రాపురంలో 17, పందెనపల్లిలో 15, బాస్కర్లబాయిలో 11, నల్కుంటబొల్లలో 8 మందికి పింఛన్లు మంజూరయ్యాయి.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గౌడ, చేనేత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం చేయూత పింఛన్లు మంజూరు చేస్తోందన్నారు
ఈ కార్యక్రమంలో నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ గుత్తా మంజుల మాధవరెడ్డి, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్), జెడ్పీ సీఈఓ ఎన్. ప్రేమ్ కరణ్ రెడ్డి, డీఆర్‌డీఓ వై. శేఖర్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి సతీష్ కుమార్, ఎంపీడీఓ జి. అంజన్ రెడ్డి, ఎంపీఓ కళ్ళెపురం స్వరూపారాణి, ఏపీవో రామ్మోహన్, భోనగిరి రమేష్, కట్టంగూర్ మాజీ జెడ్పీటీసీ మాద యాదగిరి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుంకరబోయిన వెంకన్న, మాజీ అధ్యక్షుడు పెద్ది సుక్కయ్య గౌడ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడు గుండు రాంబాబు గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.