telangana
అర్హులైన పట్టభద్రులంతా ఓటరుగా నమోదు చేసుకోవాలి: దోమ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కె. నర్సప్ప
దోమ, మేజర్ న్యూస్: రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు అర్హులైన ప్రతి పట్టభద్రుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని దోమ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కె. నర్సప్ప కోరారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులతో పాటు ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, అర్హులైన మీడియా ప్రతినిధులు సైతం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనేందుకు తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకుని ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం అవసరమైన ధ్రువపత్రాలతో ఓటరు నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని తెలిపారు. ఓటరు నమోదుపై నిర్లక్ష్యం చేయకుండా ఇతర అర్హులైన పట్టభద్రులకు సైతం అవగాహన కల్పించాలని కోరారు. పట్టభద్రుల సమస్యల పరిష్కారం, యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి మద్దతు తెలిపాలని కె. నర్సప్ప విజ్ఞప్తి చేశారు.