telangana
అల్ఫోర్స్ టైనీ టాట్స్‌లో ఘనంగా వింటర్ గాలా
సూర్య కరీంనగర్ : కరీంనగర్ వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ టైనీ టాట్స్‌లో ‘వింటర్ గాలా – ఎ డే ఆఫ్ ఫన్, ఫ్రోలిక్ అండ్ ఫెస్టివిటీస్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చిన్నారులు స్నోమ్యాన్ తయారీ, స్నోబాల్ టాస్, రింగ్ టాస్, స్నోఫ్లేక్ ఆర్ట్, హస్తకళలు, నృత్యాలతో సందడి చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి చిన్నారులను అభినందిస్తూ, ఆటపాటలతో కూడిన కార్యక్రమాలు సృజనాత్మకత, సామాజిక నైపుణ్యాలు, శారీరక వికాసానికి దోహదపడతాయని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.