BREAKING
ఉమ్మడి చిత్తూరు జిల్లా కరాటే ఎంపిక పోటీలు జంక్ ఫుడ్ నివారించి ఆరోగ్యంగా జీవిద్దాం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి ఘనంగా శుభప్రదం మాల్ ప్రారంభం వృధాగా పోతున్న పాకాల చెరువు నీళ్లు త్రాగునీటి సమస్య పరిష్కారమే నా లక్ష్యం -62వ డివిజన్ ప్రచారంలో పార్థసారథి హామీ రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేసే అలవాటు ఉందా? మీ నిద్ర మరియు ఆరోగ్యంపై పడే తీవ్ర ప్రభావాలు ఇవే ప్రత్యేకావసరాల పిల్లలకు అండగా ప్రత్యేక యాప్ రాంలీలా మైదానంలో జరిగే ధర్నాకు భారీగా తరలివెళ్లిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ శ్రేణులు ఫ్రిజ్‌లో ఏ ఆహార పదార్థాన్ని ఎన్ని రోజులు నిల్వ ఉంచాలి? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు? బీజేవైఎం దేవరుప్పుల మండల అధ్యక్షుడిగా మూడ అన్వేష్ నాయక్ ఆరోగ్యానికి సంజీవని నువ్వులు.. చిన్న గింజల్లో దాగున్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు టీమ్ ఇండియాపై సరికొత్త చరిత్ర సృష్టించిన మిచెల్ సాంట్నర్.. అత్యధిక వికెట్ల వీరుడిగా రికార్డు బూరుగుపేట గ్రామపంచాయతీని తనిఖీ చేసిన డి ఎల్ పి ఓ శ్రీధర్ రావు ఆరోగ్యానికి శ్రీరామరక్ష కివీ పండు.. చిన్న ఫలంలో ఇన్ని అద్భుతమైన పోషకాలు!

అక్రమ బెల్ట్ షాపులను పూర్తిగా నిర్మూలించాలి

Select Suryaa Now
అక్రమ బెల్ట్ షాపులను పూర్తిగా నిర్మూలించాలి

హిమాయత్ నగర్, మేజర్ న్యూస్ :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బార్ అండ్ రెస్టారెంట్లపై విధించబోతున్న ప్రివిలేజ్ పన్నుపై పునరాలోచన చేయాలని తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శుక్రవారం బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాంపల్లిలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయం ఎదుట పర్మిట్ రూమ్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కోరుతూ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అక్రమంగా ఉన్నటువంటి బెల్టు షాపులను పూర్తిగా నిర్మూలించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1150 బార్లు ఉంటే అందులో 80% మధ్యతరగతి కి చెందిన బార్లేనని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా విధించబోయే పన్ను వలన ఒక్కొక్క భారుపై 30 లక్షల రూపాయల ఆర్థిక భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బార్లపై విధించే పన్నుపై పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. లేనియెడల బార్ అండ్ రెస్టారెంట్లను మూసివేసే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు.  అనంతరం ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ సలహాదారులు బాలరాజ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.