BREAKING
కరువు ప్రమాదం పొంచి ఉంది కొత్త బోర్లకు అడ్డుకట్ట వేసేది ఎవరు? నేడు ముంబైకి సీఎం రేవంత్ రెడ్డి.. రేపు మహారాష్ట్ర సీఎంతో కీలక భేటీ! మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి....! సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సుదర్శన్ రెడ్డి ​ట్రాన్స్‌ఫార్మర్‌ను కమ్మేసిన పిచ్చి మొక్కలు కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టిగా పనిచేయాలి.. టి సి వరుణ్.. పాతూరులో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం దర్శి మున్సిపాలిటీ ఏకగ్రీవం.చైర్మన్ గా దారం సుబ్బారావు ఎన్నిక. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా.. జీడబ్ల్యూఎంసీ కఠిన నిర్ణయం! అనాధ వృద్ధులు దివ్యాంగులకు బాలవికాస అండ వైసీపీని వీడి టిడిపిలో చేరిన 30 మంది యువకులు...! ప్రతి గ్రామం అభివృద్ధి లక్ష్యం. మంత్రి దాతలతో నిర్మించిన భవనాన్ని ప్రభుత్వం ఉపయోగించుకోవాలి MPTC, ZPTC ఎన్నికలు: బరిలో వేలాది మంది అభ్యర్థులు.. తుది జాబితా విడుదల! గంగానమ్మ అన్నసమారాధనకు పోటెత్తిన భక్తులు అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు కావాలి

లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్ దేవేందర్

Select Suryaa Now
లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్ దేవేందర్


 

 
 
 
 
 
 
 
ఖైదీకి సదుపాయాలు కల్పించేందుకు లంచం డిమాండ్ చేసి, తీసుకుంటూ హుజురాబాద్ సబ్ జైలర్, పెట్రోల్ బంక్ ఆపరేటర్లను ఏసిబి అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. వివరాలలోకి వెళితే... హుజురాబాద్ సబ్ జైలు డిప్యూటి జైలర్ నాంపల్లి దేవేందర్ (46) జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఫిర్యాదుదారుని మామకు మెరుగైన వసతులు కల్పించడం, ములాఖత్‌లకు అనుమతించడం, ఖమ్మం జైలుకు బదిలీ కాకుండా చూసేందుకు 10,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. కాగా బాధితుడు ఈ విషయాన్ని ఏసిబి అధికారులకు ఫిర్యాదు చేశారు.
​ఈ క్రమంలో ఏసిబి డిఎస్పి గట్ల మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం  సాయంత్రం సుమారు 5:45 గంటల సమయంలో, ఇండియన్ ఆయిల్ సబ్ జైల్ పెట్రోల్ బంక్ ఆపరేటర్ రావుల హరీశ్ (30) ద్వారా డిప్యూటీ జైలర్ దేవేందర్ రూ. 10,000 లంచం తీసుకుంటుండగా కరీంనగర్ ఏసిబి అధికారులు వలపన్ని పట్టుకున్నారు. పెట్రోల్ బంక్ ఆపరేటర్ వద్ద నుంచి రసాయన పరీక్షల అనంతరం నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డిప్యూటి జైలర్ దేవేందర్, బంక్ ఆపరేటర్ హరీశ్ లను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను కరీంనగర్ ఏసిబి ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నంబర్ 1064, వాట్సాప్ నంబర్ 9440446106 ద్వారా సంప్రదించాలని అధికారులు సూచించారు.