BREAKING
కొబ్బరికాయలో శివలింగాకారం.. భక్తులలో భక్తిభావం ! సింగరేణిలో అన్ని సంఘాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించాలి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు షేర్ మొహమ్మద్ పేటలో కూటమి అభ్యర్థిని షేక్ సమీనా నాగులు మీరా కి పెరుగుతున్న మద్దతు. గోళ్లపాడు రైతుల కల సాకారం.. పొంగులేటి రాజకీయ చొరవతో కొత్త సొసైటీ! ఎన్నికలకు బ్యాలెట్ పేపర్లను సిద్ధం చేస్తున్న అధికారులు ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఉద్యోగులు. కంటోన్మెంట్ టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి ఆరోపణలు.. సీబీఐ ముమ్మర విచారణ *కుర్వపల్లి మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలి: సంకాపురం రాముడు** గుంటూరు మేయర్‌గా కోవెలమూడి లక్ష్మి అపర్ణ ప్రమాణ స్వీకారం: డిప్యూటీ మేయర్‌గా యర్రంశెట్టి రాజేష్ ఎన్నిక చిన్నారులపై మతపరమైన ఒత్తిడి తగదు వీణవంకకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేయాలి – బీసీ గురుకుల పాఠశాలను తక్షణమే తరలించాలి రెండో విడత దళితబంధు విడుదల చేయాలి అద్దేపల్లి లో సాయిబాబా ఎన్నికల ప్రచారం నా ప్రశ్నలకు జవాబు ఎవరిస్తారు....!? ** ముఖ్యమంత్రా... జిల్లా మంత్రా...!?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మెరుగైన బోధన.... మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి పార్థసారథి.

Select Suryaa Now
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మెరుగైన బోధన.... మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి పార్థసారథి.


నల్గొండ జిల్లా బ్యూరో, మేజర్ న్యూస్... మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు నవీకరించిన జ్ఞానాన్ని అందించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సీ (కృత్రిమ మేధస్సు) బాగా ఉపయోగపడుతుందని విశ్రాంత ఐఏఎస్ అధికారి, మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ 
సి. పార్థసారథి అన్నారు.మంగళవారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న ఉదయాదిత్య భవన్లో ఎంఈఓ లు, స్కూల్ అసిస్టెంట్లు , ఎమ్మార్పీలు, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ లకు ఉద్దేశించి" ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మెరుగైన బోధన" పై ఏర్పాటు చేసిన వర్క్ షాప్ కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.కాలానుగుణంగా సాంకేతికత పెరుగుతూ వస్తున్నదని, అదే సమయంలో బోధించే విధానంలో కూడా మార్పులు వస్తున్నాయని, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత విద్యార్థులకు బోధించడంలో ఉపాధ్యాయుల పాత్ర పై ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సీ చాలా శక్తివంతమైన ఆయుధమని, దీన్ని ఎంత బాగా సద్వినియోగం చేసుకుంటే అంత ఫలితం ఉంటుందని, ఇది ఒక రకంగా చెప్పాలంటే మంచి సహాయకుడిగా పనిచేస్తుందని, వృత్తిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ని ఎలా వాడుకోవాలో ఆలోచించాల్సి ఉందని అన్నారు. ప్రస్తుతం ప్రతి రంగంలో, ప్రతి ఒక్కరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఆధారపడుతున్నారని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  తో విద్యార్థులకు మంచి విద్యను అందించడంతో పాటు, పాఠశాలలకు సంబంధించిన సమాచారాన్ని, నివేదికలను  వేగంగా రూపొందించే అవకాశం ఉందన్నారు.  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి పసివాడు మనసు తెలుసుకోవడం చాలా కష్టమని, కానీ ఉపాధ్యాయుడు పిల్లల మనసును బాగా అర్థం చేసుకుంటారని, ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయుల మేధస్సుకుఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోడైతే ఇంకా మంచి బోధనను అందించవచ్చన్నారు .సమాజాన్ని మార్చే శక్తి ఉపాధ్యాయులకు ఉంటుందని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై అవగాహన లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వచ్చినవారు ఎదుటి వ్యక్తులను మోసం చేసే అవకాశం ఉందని, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తు లో విద్యార్థులకు నవీకరించిన జ్ఞానాన్ని అందించే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు.జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయులు కూడా మారాల్సిన అవసరం ఉందని, ప్రతిరోజు బోధనతోపాటు, పాఠశాలకు సంబంధించిన వివిధ అంశాలతో పని భారం పెరుగుతున్నదని, ప్రత్యేకించి రిపోర్ట్లు, ఎఫ్ఆర్ఎస్ ,అటెండెన్స్, మిడ్ డే మీల్స్ ,ఫిజిక్స్ వాలా తదితర రిపోర్టుల తయారీకి ఏఐని ఎలా వినియోగించుకోవాలో ఉపాధ్యాయులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ పని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేయవచ్చని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ను వినియోగించుకొని ప్రతిరోజు కార్యక్రమాలను సులభంగా చేసుకోవచ్చో ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు.స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్ రావు, ఎస్  సి ఈ ఆర్ టి రిసోర్స్ పర్సన్ లక్ష్మీనాదం, తదితరులు ఉన్నారు.