BREAKING
చిన్నారుల ఆరోగ్య రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలి మైనారిటీలకు అండగా నిలుస్తూ పేద విద్యార్థిని, విద్యార్థులకు ఇంటి పెద్ద కొడుకులా ఆదుకుంటున్న వక్స్ బోర్డ్ డైరెక్టర్...... ఇస్మాయిల్ బేగ్ ఉచిత మెగా వైద్య శిబిరం చేరుకులపాడు సర్పంచ్ అభ్యర్థిగా శకుంతలమ్మ నామినేషన్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన డీసీసీ అధ్యక్షులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి. పల్స్ పోలియో - మన పిల్లల భవిష్యత్తుకు రక్షణ టెలికం బోర్డు మెంబర్ బీజేపీ జిల్లా నాయకులు బైండ్ల కుమార్ పేకాట స్థావరంపై పోలీసుల దాడి నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే.. రెండు చుక్కలు జీవితానికి రక్షణ: సర్పంచ్ మేఘనాథ్ రెడ్డి నిరుపేదలకు ఆరోగ్య భరోసా కల్పించడమే లక్ష్యం లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పల్స్ పోలియో చుక్కలు వేయించాలి: సర్పంచ్ బొక్క సువర్ణ అంజిరెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు...గుత్తుల సాయి… ఎన్విడియాకు మరో భారీ షాక్: జెన్సెన్ హువాంగ్ నిష్క్రమణ తర్వాత అకౌంటింగ్ అవకతవకలపై యూఎస్ ఎస్‌ఈసీ దర్యాప్తు! రాచులూర్ లో పల్స్ పోలియో కార్యక్రమం డీసీసీ అధ్యక్షుడిగా ధారాసింగ్ నాయక్‌కు ఏడాది పూర్తి.. పెద్దేముల్ మండల కాంగ్రెస్ నేతల శుభాకాంక్షలు

ఆకర్షణీయంగా స్కూల్ యూనిఫారాలు : సీఎం రేవంత్

Select Suryaa Now
ఆకర్షణీయంగా స్కూల్ యూనిఫారాలు : సీఎం రేవంత్

హైదరాబాద్, సూర్య ప్రతినిధి :విద్యార్థులకు అందించే యూనిఫాం మరింత ఆకర్షణీయమైన రంగుల్లో ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. డిజైన్లలో వైవిధ్యానికి ప్రయత్నించాలని చెప్పారు. విద్యార్థులకు అందించే యూనిఫాం, ఇతర సామగ్రి పంపిణీపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. 

ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్స్ స్కూల్స్ పిల్లలకు ఒక జత యూనిఫాం పంపిణీ పూర్తయిందని, రెండో జత యూనిఫాంను నెలాఖరులోగా అందజేస్తామని సమావేశంలో  అధికారులు తెలియజేశారు. కేజీబీవీ, మోడల్ స్కూల్ విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలు అందజేసినట్లు తెలిపారు. 

 విద్యార్థులందరికీ నోటు పుస్తకాలు పంపిణీ పూర్తయిందన్నారు. ప్రభుత్వ వసతిగృహాలు, రెసిడెన్షియల్స్ స్కూల్స్, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలోని విద్యార్థులందరికీ ప్లేట్లు, గ్లాసులు, కటోరాలు, స్పూన్లు, కప్పులు, కార్పెట్లు, బెడ్‌షీట్లు, టవళ్లు పంపిణీ పూర్తయిందని అధికారులు వివరించారు. 

వచ్చే ఏడాది పాఠశాలలు తెరిచిన రోజే యూనిఫాం, ఇతర సామగ్రి విద్యార్థులకు అందేలా ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న విద్యార్థులకు అదనంగా 10 శాతం విద్యార్థులు పాఠశాలల్లో చేరే అవకాశం ఉన్నందున, అందుకు తగినట్లు ప్రణాళిక రూపొందించుకోవాల‌ని చెప్పారు. 

ఈ ఏడాది అందించిన యూనిఫాం, ఇత‌ర సామ‌గ్రి నాణ్యతపై తల్లిదండ్రుల నుంచి సంతృప్తి వ్యక్తమైందని అన్నారు. సమీక్షలో ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి , ఎంపీ వేం నరేందర్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.