7వ బెటాలియన్‌లో అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరం
సూర్య డిచ్ పల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ఏడవ బెటాలియంలో అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సెవెంత్ బెటాలియన్, కమాండెంట్ బి.సీతారాం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా బెటాలియన్ అధికారులు, సిబ్బంది రక్తదాన శిబిరంలో పాల్గొని స్వచ్ఛందంగా 71 మంది రక్తదానం చేశారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి సకాలంలో రక్తం అందించడం ద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చని అధికారులు పేర్కొన్నారు.పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ సమాజ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. రక్తదానం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి, స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్స్ దేవినేని శ్రీనివాస్, విజయ్, మెడికల్ ఆఫీసర్ అనుపమ, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ సతీష్,నిజాంబాద్ గవర్నమెంట్ హాస్పటల్ నుంచి డాక్టర్ భార్గవి జోషి,శ్రీధర్, ల్యాబ్ టెక్నీషియన్స్ సందీప్, చందు బెటాలియన్ అధికారులు, సిబ్బంది, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.