telangana
31 వ రోజుకు చేరుకున్న జాతీయ ఆరోగ్య మిషిన్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమ్మె
సూర్య కామారెడ్డి జిల్లా ప్రతినిధి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ లో గురువారం జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల నిరవధిక సమ్మె 31వ రోజుకు చేరుకుంది. నెల రోజులు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వం మరింత తాత్సారం చేయడం సబబుగా లేదని అత్యవసర విభాగంతో త్వరితగతిన చర్చలు జరిపి నిర్ణయాలు ప్రకటించాలని ప్రభుత్వాన్ని ఈ మేరకు కోరారు. ప్రభుత్వం తాత్సారం చేయడంపై ఉద్యోగులంతా వినూత్న కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా వైద్య రంగంలో సేవలు అందిస్తున్న ఎన్.హెచ్.ఎం. (నేషనల్ హెల్త్ మిషన్) కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరవధిక సమ్మె రోజురోజుకూ ఉద్రిక్తతకు దారితీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులు చేపట్టిన శాంతియుత నిరసన కార్యక్రమం ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ ఉద్యోగులు "తెల్లముఖం వేసుకొని" మరీ తమ నిరసనను వినూత్న రీతిలో వ్యక్తం చేశారు."తెల్ల ముఖం మా నిరసన, ప్రభుత్వ మౌనం మీ నిర్లక్ష్యం, ముఖానికి రంగు లేదు, మా జీవితాలకు భరోసా లేదు, NHM ఉద్యోగులకు భద్రత కల్పిస్తూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, మా ముఖాలు తెలపడ్డాయి మీ మనసులు కరగలేదా?" అంటూ తమ నిరసనను వినూత్న పద్ధతిలో తెలిపారు. రేపటి రోజున వైద్యానికి శాఖ కమిషనర్ తో జరగబోయే చర్చల్లో ప్రభుత్వం తమ వైఖరిని స్పష్టం చేస్తూ NHM ఉద్యోగులకు భరోసా ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ హెచ్ ఎం జేఏసీ జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి సుమన్, జేఏసీ నాయకులు బట్టు పద్మజ, డా.మామిండ్ల మారుతి, డా.పల్స హరీష్ డా.వేణుమాధవ్, డా.రాజశేఖర్, డా.వంగ రాహుల్ కుమార్, వెంకటరమణ, అశ్విని, ఎల్లేశం, నరేష్, ఎలిజబెత్, సావిత్రి, గీత, లక్ష్మీప్రసన్న, యానీబెరీ, విజయ, రాజమణి, పుష్ప తదితరులు పాల్గొన్నారు.