BREAKING
నేషనల్ అవార్డ్‌ అందుకున్న సుకుమార్, నిహారిక వాడపల్లి క్షేత్రం.. భక్తజన శోభితం శ్రీశైలంలో శ్రీ కుమారస్వామికి ప్రత్యేక పూజలు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్‌కు రోటరీ ఐ హాస్పిటల్‌లో శిబిరం  యూనస్ హయాంలో కుదిరిన అమెరికా వాణిజ్య ఒప్పందంపై బంగ్లాదేశ్ మీడియా అసంతృప్తి: సమీక్షించాలని తాత్కాలిక ప్రభుత్వానికి విజ్ఞప్తి ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్ష వినాయక మండపంలో పూజ.. రాజోలి వీరారెడ్డి శ్రీ మఠంలో సుదర్శన హోమం ప్రతిభావంతులైన విద్యార్థినులకు నగదు పురస్కారాలు చదువులో రాణించాలి - కోటిరెడ్డి ట్రస్ట్ వారసులు.. 104 వైద్య సేవలో నిర్లక్ష్యం -ఎగువ పల్లె ప్రజలు ఆవేదన  సరికొత్త ఉడాన్ పథకానికి21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రీన్ సిగ్నల్:  విస్తరించనున్న ప్రాంతీయ విమానయాన సేవలు డ్రైనేజీ ఆక్రమణల తొలగింపునకు మున్సిపల్ చర్యలు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సమిష్టి కృషి. డివిజన్‌లో ఈ నెల 27న టీయూడబ్ల్యూజేఎఫ్ సమావేశం. వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి వల్లూరు.. తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా.. పంట నమోదు చేసుకున్న ప్రతి రైతు తప్పనిసరిగా ఈకేవైసి చేయించుకోవాలి. మండల వ్యవసాయ అధికారి మారెడ్డి వెంకట క్రిష్ణారెడ్డి గుజరాత్‌లో జాతీయ రహదారులు, సాగునీటి ప్రాజెక్టులకు లైన్ క్లియర్: ఎన్‌హెచ్ఏఐ, ఎస్‌ఎస్ఎన్‌ఎన్ఎల్ మధ్య కీలక ఒప్పందం

వికారాబాద్ జిల్లాలో మైనర్ బాలికలపై అఘాయిత్యం కలకలం.. రాజీ పేరుతో కేసు నీరుగారుస్తున్న ఎస్సై

Select Suryaa Now
వికారాబాద్ జిల్లాలో మైనర్ బాలికలపై అఘాయిత్యం కలకలం.. రాజీ పేరుతో కేసు నీరుగారుస్తున్న ఎస్సై

దోమ మండల కేంద్రంలో ఘటన
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 22):వికారాబాద్ జిల్లా దోమ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసిన మైనర్ బాలికలపై అఘాయిత్యం వ్యవహారం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించి బాధితుల నుంచి ఫిర్యాదు వచ్చిన మాట వాస్తవమేనని ఎస్సై వసంత్ జాదవ్ అంగీకరించినప్పటికీ, తొలి దశలో ఆయన వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఇరువర్గాల వారు రాజీ లేఖ రాసి ఇవ్వడం వల్లే తాను వెంటనే కేసు నమోదు చేయలేదంటూ ఎస్సై తెరపైకి తెచ్చిన విచిత్ర వాదన ఇప్పుడు పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చట్ట ప్రకారం పోక్సో చట్టం కింద వచ్చే తీవ్రమైన నేరాలను కూడా కాంప్రమైజ్ చేసేందుకు ప్రయత్నించడంపై ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.ఈ దారుణ ఘటనకు సంబంధించి సమాచారం జిల్లా ఎస్పీ దృష్టికి వెళ్లడం, పరిగి డీఎస్పీ శ్రీనివాస్ ప్రత్యేకంగా ఒత్తిడి తేవడంతో స్థానిక పోలీసు యంత్రాంగంలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. ఉన్నతాధికారుల సీరియస్ హెచ్చరికలతో అప్రమత్తమైన పోలీసులు హుటాహుటిన దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగానే బాధితులను, నిందితులను మళ్లీ పోలీస్ స్టేషన్‌కు హడావుడిగా పిలిపించి ఇప్పుడు కేసు నమోదు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 15 వ తేదీనే ఈ ఘటన జరిగిందని ప్రాథమికంగా చెబుతున్నప్పటికీ, ఇప్పుడే తమకు కొత్తగా ఫిర్యాదు అందిందంటూ ఎస్సై వసంత్ జాదవ్ పొంతనలేని సమాధానాలతో కాలయాపన చేసే ప్రయత్నం చేయడం గమనార్హం.సమాజంలో బాలికల రక్షణ కోసం కఠినమైన చట్టాలు అమల్లో ఉన్నప్పటికీ, బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ఇలాంటి అఘాయిత్యాలను రాజీ పేరుతో నీరుగార్చాలని చూసిన ఎస్సై వసంత్ జాదవ్‌పై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ సున్నితమైన కేసు పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడించేందుకు మాత్రం పోలీసులు ఇప్పటికీ తీవ్ర విముఖత వ్యక్తం చేస్తుండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఉన్నతాధికారులు ఈ ఉదాసీన వైఖరిపై సమగ్ర విచారణ జరిపించి, బాధితులకు నిజమైన న్యాయం జరిగేలా చూడాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.