BREAKING
'ఆదర్శ కుటుంబం.. AK47' రిలీజ్ వాయిదా.. వెంకటేష్-త్రివిక్రమ్ సినిమా కొత్త విడుదల తేదీ ఇదే! అమెరికా మార్కెట్ లోకి షిరిడి సాయి ట్రాన్స్ఫారంలు ఎగుమతి ప్రైమ్ వీడియో 'ది లవ్ హైపోథెసిస్' రివ్యూ.. నకిలీ ప్రేమలో అసలైన మ్యాజిక్ వర్కవుట్ అయిందా? కేంద్ర ప్రభుత్వ విధానాలతో ప్రభుత్వ రంగానికి తీరని నష్టం 24న ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా కడప కార్పొరేషన్ లోని 66 డివిజన్లో ఓటర్ జాబితా విడుదల మహిళా అభివృద్ధికి మోదీ ప్రభుత్వం పెద్దపీట జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా తలమల్ల మల్లేశం యూనస్ హయాంలో కుదిరిన అమెరికా వాణిజ్య ఒప్పందంపై బంగ్లాదేశ్ మీడియా అసంతృప్తి 'మీసయ మురుక్కు 2' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. హిప్‌హాప్ ఆది సినిమా ఎలా ఉందంటే? గణేష్ నిమజ్జన ప్రదేశాలను పరిశీలించిన ఎస్సై ఆవుల తిరుపతి ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌లలో నికెల్ గనుల కొనుగోలుకు భారత్‌కు చెందిన 'లోహమ్' కసరత్తు యూపీఐ ప్లాట్‌ఫారమ్‌లకు ఫీజుల మోత లిథువేనియాకు అమెరికా బలగాల నూతన నియామకం 4వ సారి జాతీయ ఉత్తమ నటుడిగా మమ్ముట్టి.. కార్తీక్ ఆర్యన్‌కూ ప్రతిష్టాత్మక అవార్డు!

వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి వల్లూరు.. తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా..

Select Suryaa Now
వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి  వల్లూరు.. తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా..

వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి

వల్లూరు.. తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా..


వల్లూరు మేజర్ న్యూస్

తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ వల్లూరు మండల పరిధిలోని వీఆర్ఏలు సోమవారం వల్లూరు తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ధర్నా నిర్వహించారు. కార్యాలయం సమీపంలో శిబిరం ఏర్పాటు చేసి తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వీఆర్ఏలు మాట్లాడుతూ  అరకొర వేతనాలతో విధులు నిర్వహిస్తూ కుటుంబాలను పోషించుకోవడం ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్కువ వేతనాలతో అధిక పనిభారం మోస్తున్నామని తెలిపారు. తమకు రావాల్సిన పదోన్నతులు, పే స్కేల్‌ వేతనాలు, ఇతర సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చామని, అయినప్పటికీ స్పందన లేకపోవడంతో ధర్నా చేయాల్సి వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యలను సానుకూలంగా పరిగణనలోకి తీసుకుని న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి తమకు న్యాయం చేయాలని  కోరారు. ధర్నాలో పలువురు వీఆర్ఏలు పాల్గొన్నారు..