ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్‌కు రోటరీ ఐ హాస్పిటల్‌లో శిబిరం
ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్‌కు రోటరీ ఐ హాస్పిటల్‌లో శిబిరం
ప్రొద్దుటూరు, మేజర్ న్యూస్: రోటరీ క్లబ్ ప్రొద్దుటూరు అధ్యక్షులు కొవ్వూరు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో, రోటరీ ఐ హాస్పిటల్ అధ్యక్షులు ఎం.వి.ఎన్. ప్రభు సహకారంతో ఈ నెల 27న ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రోటరీ ఐ హాస్పిటల్‌లో కిమ్స్ సవేరా హాస్పిటల్ వైద్యుల ఆధ్వర్యంలో శిబిరం జరుగుతుందని పేర్కొన్నారు. శిబిరానికి సంబంధించిన వివరాలను ప్రజలకు తెలియజేసేందుకు మంగళవారం కరపత్రాన్ని విడుదల చేశారు. ప్రజలు ముందుగా హాస్పిటల్‌లో లేదా కరపత్రంలో ఇచ్చిన ఫోన్ నంబర్‌కు సంప్రదించి తమ పేర్లు, వివరాలను నమోదు చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి గండ్లూరు శ్రీధర్ శర్మ, రోటరీ ఐ హాస్పిటల్ సెక్రటరీ బేపారి జాకీర్ అహ్మద్, ఫాస్ట్ ప్రెసిడెంట్ గుర్రం రామకృష్ణ, ఫాస్ట్ ప్రెసిడెంట్ తిరుమల బాల సూర్యరావు, క్లబ్ వైస్ ప్రెసిడెంట్ కె. రవికుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.