జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా తలమల్ల మల్లేశం
జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా తలమల్ల మల్లేశం
మునుగోడు,మేజర్ న్యూస్:
మండలంలోని కొరటికల్ గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులకు పనిచేస్తున్న తలమల్ల మల్లేశం జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి,జిల్లా కలెక్టర్
బి.చంద్రశేఖర్, జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్ రావు చేతుల మీదుగా ఆయన జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయుల అవార్డును అందుకున్నారు. విద్యార్థుల విద్యాభివృద్ధి, పాఠశాల అభివృద్ధికి చేసిన సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలిపారు. అవార్డు అందుకున్న తలమల్ల మల్లేశంను ఉపాధ్యాయులు, విద్యార్థులు, పలువురు విద్యావేత్తలు అభినందించారు.