50 ఏళ్ల గణపతి మహోత్సవ చరిత్రకు సావనీర్ రూపం
50 ఏళ్ల గణపతి మహోత్సవ చరిత్రకు సావనీర్ రూపం
ప్రొద్దుటూరు, మేజర్ న్యూస్: స్థానిక టిటిడి కళ్యాణ మండపంలో గణపతి మహోత్సవ కమిటీ 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రూపొందించిన సావనీర్‌ను మంగళవారం ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఆనందకరమని, గణపతి మహోత్సవాల చరిత్రను ప్రజలకు, భావితరాలకు అందించేలా సావనీర్ రూపొందించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో అగస్త్యేశ్వరాలయ పాలకమండలి ఛైర్మన్ వంగల నారాయణరెడ్డి, పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ నాగదస్తగిరిరెడ్డి, శివాలయం గణపతి మహోత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.