BREAKING
25 న మున్సిపల్ అధికారులతో జాయింట్ కలెక్టర్ సమీక్షా సమావేశం 2028లో తెలంగాణలో బీసీలదే రాజ్యాధికారం: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఆత్మహత్యాయత్నం శ్రీశైలంలో అన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం శ్రీశైలంలో నందీశ్వర స్వామివారికి విశేష పూజలు శ్రీశైల క్షేత్ర పాలకుడికి విశేష పూజలు శ్రీశైలంలో అలరిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు పీఏసీఎస్‌ చౌటుప్పల వైస్‌ చైర్మన్‌గా శివారెడ్డి కత్రినా కైఫ్ ట్రోలింగ్‌పై పరిణీతి చోప్రా సీరియస్.. ప్రసనానంతర శరీర మార్పులపై అన్ ఎడ్యుకేటెడ్ కామెంట్స్ అంటూ ఆగ్రహం! ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్ష వినాయక మండపంలో పూజ.. రాజోలి వీరారెడ్డి రాణి ముఖర్జీ తల్లి కృష్ణ ముఖర్జీ కన్నుమూత.. నివాళులర్పించిన షారూఖ్, ఆలియా, కరణ్ జోహార్! పాక మల్లేష్ కు యాదవ సంఘం అభినందనలు పెన్నా కాలుష్యంపై బీజేపీ సమరశంఖం 24న వాసవి సర్కిల్ వద్ద ధర్నా — పాలెం రెడ్డి కిరణ్ పులివెందుల మున్సిపాలిటీ అభివృద్ధికి 20 కోట్లు సోషల్ హల్‌చల్: వామికా గబ్బీ విశ్వరూపం.. సారీలో మృణాల్ ఠాకూర్ మెరుపులు!

పెన్నా కాలుష్యంపై బీజేపీ సమరశంఖం 24న వాసవి సర్కిల్ వద్ద ధర్నా — పాలెం రెడ్డి కిరణ్

Select Suryaa Now
పెన్నా కాలుష్యంపై బీజేపీ సమరశంఖం  24న వాసవి సర్కిల్ వద్ద ధర్నా — పాలెం రెడ్డి కిరణ్

పెన్నా కాలుష్యంపై బీజేపీ సమరశంఖం

24న వాసవి సర్కిల్ వద్ద ధర్నా — పాలెం రెడ్డి కిరణ్

ప్రొద్దుటూరు, మేజర్ న్యూస్: పెన్నా నదిలో చెత్త, వ్యర్థాలు, జంతువుల కళేబరాలు పడేయడంతో నీరు కలుషితమవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని బీజేపీ అర్బన్–2 అధ్యక్షుడు పాలెం రెడ్డి కిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యపై ఇప్పటికే అధికారులకు ఫిర్యాదులు, పత్రికా ప్రకటనల ద్వారా తెలియజేసినా చర్యలు తీసుకోలేదన్నారు. అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈ నెల 24న ఉదయం 9 గంటలకు వాసవి సర్కిల్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. పెన్నా నది పరిరక్షణ కోసం చేపడుతున్న ఈ ఆందోళనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, పర్యావరణ పరిరక్షణను కోరుకునే వారు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ధర్నా కార్యక్రమం ఏర్పాట్లపై పాలెం రెడ్డి కిరణ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పర్లపాడు గౌరీ శంకర్, జిల్లా కార్యదర్శులు జయలక్ష్మి, చిరంజీవి రెడ్డి, అర్బన్–2 ప్రధాన కార్యదర్శి దేవరశెట్టి విక్రాంత్, రూరల్ మండల అధ్యక్షుడు మురళి, ఎస్సీ మోర్చా నాయకులు పాల్, శ్యామ్, బీజేవైఎం అధ్యక్షుడు అభినయ్, కుమారి, అఖిల, సంజీవ రాయుడు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొని ధర్నాను విజయవంతం చేస్తామని తెలిపారు.