శ్రీశైలంలో నందీశ్వర స్వామివారికి విశేష పూజలు
శ్రీశైల ఆలయంలో కొలువైన శ్రీ శనగల బసవన్న (నందీశ్వర) స్వామికి ప్రదోషకాలంలో విశేష అభిషేక పూజలు నిర్వహించారు. నందీశ్వరస్వామికి శాస్త్రోక్తంగా పంచామృతాలతోనూ, ఫలోదకాలతో హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, భస్మోదకం, రుద్రాక్షోదకం, బిల్వోదకం, పుష్పోదకం, సువర్ణోదకం, మల్లికా గుండంలోని శుద్ధజలంతో అభిషేకం నిర్వహించి తరువాత నందీశ్వరస్వామికి అన్నాభిషేకం జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చక స్వాములు పాల్గొన్నారు.