శ్రీశైలంలో శ్రీ కుమారస్వామికి ప్రత్యేక పూజలు
లోక కల్యాణం కోసం శ్రీశైల ఆలయ ప్రాంగణంలోని శ్రీసుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి) వారికి మంగళవారం విశేష పూజలను నిర్వహించారు. ముందుగా అర్చకులు సేవా సంకల్పాన్ని పఠించి మహాగణపతి పూజ అనంతరం సుబ్రమణ్య స్వామికి ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ అభిషేకంలో పంచామృతాలైన పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీళ్లు, వివిధ పండ్ల రసాలతో అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పళ్ల రసాలతో చేసే అభిషేకంతో ఎంతో ఫలితం ఉంటుందని ఆగమాలు చెబుతున్నాయి.