శ్రీ మఠంలో సుదర్శన హోమం
శ్రీ మఠం లో సుదర్శన హోమం
మంత్రాలయం సూర్య ప్రతినిధి
కర్నూలు జిల్లా శ్రీ రాఘవేంద్ర స్వామి వెలసిన బృందావన కోవెల మంత్రాలయం శ్రీమఠం లో మంగళవారం పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్రతీర్థులు ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ సుదర్శన హోమం నిర్వహించి తప్త ముద్రాధారణ నిర్వహించారు. శ్రీ మఠం శిష్యులు, స్థానిక భక్తులు, శ్రీమఠం సిబ్బంది పెద్ద సంఖ్యలో ఈ పవిత్రోత్సవంలో పాల్గొని పీఠాధిపతుల చేత తప్త ముద్ర ధారణను స్వీకరించి వారి ఆశీస్సులు పొందారు. శ్రీ రాఘవేంద్ర స్వాముల నిజ బృందావనం దర్శనంతో భక్తులు పరామర్శించిపోయారు.