అన్నదానంతో ఆధ్యాత్మిక సేవ
చౌటుప్పల్: చౌటుప్పల్ మండలంలోని రెడ్డిబావిలో శ్రీ ఆంజనేయ లారీ డ్రైవర్స్, ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.అన్నప్రసాద వితరణను కార్యక్రమ పోషకులు హీణదేవి అనిల్ (అనిల్ దాబా) ప్రారంభించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు సేవ చేయాలనే ఉద్దేశంతో అన్నప్రసాద వితరణ చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ నందగిరి వెంకటేష్‌గౌడ్ హాజరై నిర్వాహకులను అభినందించారు. భక్తి కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు పల్లె శేఖర్,ఉపాధ్యక్షుడు నూకల యాదయ్య, ప్రధాన కార్యదర్శి నందగిరి దినేష్, కోశాధికారి నందగిరి మహేష్,వార్డు సభ్యులు ఉయ్యాల రమేష్, అసోసియేషన్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.